టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

 • 2014 క్యాలెండర్లు, డైరీలు విడుదల
 • తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సావాల పోస్టర్
 • టీటీడీ పర్మినెంట్ ఉద్యోగులకు 10 వేలు
 • కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 వేలు
 • ఏకాదశి నుంచి దివ్వ దర్శనం భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం
 • ఉచిత లడ్డూల కోసం ఏడాదికి 12 కోట్లు
 • వైఖానస ఆగమ సలహాదారునిగా ఎన్‌.వి మోహన్ రంగాచార్యులు
 • రూ. 3.20 కోట్లతో తిరుచానూరు శ్రీనివాసుని ఆలయ పునర్నిర్మాణం
 • 1000 కాళ్ల మండపం నిర్మాణంపై ఉన్నత స్థాయి కమిటీ
 • జేఈవో, సీవీఎస్‌వో, ఛీఫ్ ఇంజనీర్, ఇంటెలిజెన్స్ అధికారి
 • 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
 • మిరాశి అర్చకుల వయో పరిమితి రద్దు
 • ముగ్గురు అర్చకులు తిరిగి విధుల్లోకి
 • మంగళగిరిలో రూ. 2.60 కోట్లతో యాత్రి సదన్
 • రూ. 31.70 కోట్లతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
 • తిరుపతిలోని శ్రీనివాసం, విష్టునివాసం, మాధవం అతిథి భవనాల్లో అన్నదానం
 • శ్రీవారి లడ్డూల నాణ్యత పెంపుకోసం కరసత్తు
 • చిత్తూరు సమీపంలోని పలమనేరు వద్ద 250 ఎకరాల్లో గోశాల
 • టీటీడీ ఉద్యోగులకు హెల్త్ ఇన్సురెన్స్‌లు
 • తిరుమల భద్రత కోసం 69కోట్ల తో సిసిటివి నెట్‌వర్క్‌
 • HCL కంపెనీ నుంచి 5 కోట్లు విరాళం
 • తిరుమల నో ఫ్లై జోన్ విషయంపై దృష్టి
 • స్టాండింగ్ కమిటీ ఫర్ హోమ్ అఫైర్స్ మెంబర్ వెంకయ్యనాయుడుకు నివేదిక
 • 50 వేల వేల మహాభారతం పుస్తకాలు
 • భగవద్గీత ఫౌండేషన్‌కు 40 లక్షల రూపాయలు

వెంకటేశ్వరస్వామి భక్తులకు TTD వరాల జల్లు కురిపించింది. కాలినడకన వచ్చే భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇస్తామని పాలకమండలి సమావేశం తీర్మానించింది. లడ్డూ ప్రసాదం ధర పెంచబోమని… చెప్పిన TTD… నాణ్యత పెంపు విషయంలో కృషి చేస్తామని హామీ ఇచ్చింది. అటు ఉద్యోగులకు కూడా హామీలు గుప్పించింది. శాశ్వత ఉద్యోగులకు పదివేలు, తాత్కాలిక ఉద్యోగులకు ఐదు వేల చొప్పున బ్రహ్మోత్సవ బహుమానం ప్రకటించింది TTD.


టీటీడీ అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా 2014 క్యాలెండర్‌,డైరీలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. టిటిడిలో పనిచేసే పర్మినెంట్ ఉద్యోగులకు 10వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 వేల చొప్పున బ్రహ్మోత్సవ బహూమానం ఇవ్వాలని నిర్ణయించారు. దివ్యదర్శనం భక్తులకు వైకుంఠ ఏకాదశి నుంచి ఉచితంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం అందిస్తామంటూ తీపి కబురు చెప్పింది. దీనికోసం సంవత్సరానికి 12 కోట్లు వెచ్చించనున్నారు. వైఖానస ఆగమ సలహా దారుణిగా  ఎన్.వి.మోహన్ రంగాచార్యులు నియమించారు. ౩ కోట్ల 20 లక్షల రూపాయలతో తిరుచానూరు లోని శ్రీనివాసం ఆలయాన్ని పునర్నిమించనున్నారు.  వెయ్యికాళ్ల మండపం పునఃనిర్మాణంపై ఉన్నత స్థాయి కమిటీ వేశారు. ఇందులో  తిరుమల జెఈఓ, CVSO, టిటిడి ఛీఫ్ ఇంజనీర్, ఇంటలిజెన్స్ అధికారి సభ్యులుగా ఉంటారు . 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని అదేశించింది.

మిరాశి అర్చకులకు వయో పరిమితి రద్దు చేసి గతంలో విధులనుంచి తొలగించిన ముగ్గురు అర్చకులను తిరిగి విధుల్లోనికి తీసుకుంటామని సమావేశం తెలిపింది. విజయనగరం వద్ద కంచి ఆసుపత్రికి కేటాయించిన స్థలం తిరిగి తీసుకోవడంపై కమిటీ ఏర్పాటు చేసింది. మంగళ గిరిలో 2కోట్ల 60 లక్షలతో కోట్ల రూపాయలతో యాత్రి సదన్, 31కోట్ల 70 లక్షలతో లక్ష్మినరసింహ స్వామి ఆలయం పురనుద్దరణ చేయాలని తీర్మానించింది . తిరుపతిలోని శ్రీనివాసం, విష్టునివాసం, మాధవం అతిథి భవనాల్లో అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.  లడ్డూల దిట్టం పెంచే ఆలోచన లేదని నాణ్యత పెంపుకోసం కరసత్తు చేస్తున్నామన్నారు. చిత్తూరు సమీపంలోని పలమనేరు వద్ద 250 ఎకరాల్లో గోశాల ఏర్పాటు చేయనున్నారు.  ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో టిటిడి ఉద్యోగులకు హెల్త్ ఇన్సురెన్స్‌లు ఏర్పాటు చేసేందుకు పాలకమండలి నిర్ణయించింది.

మరోవైపు  టిటిడి నిర్వహించిన కళ్యాణోత్సవాల్లో ఎలాంటి అవకతవకలు జరుగలేదని … అవినీతి జరిగిందని ఆధారలతో నిరూపిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమాచార హక్కుచట్టం టిటిడికి వర్తించదని బాపిరాజు తెలిపారు.  తిరుమల భద్రత కోసం 69కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సిసిటివి నెట్‌వర్క్‌కు HCL కంపెనీ నుంచి 5 కోట్లు విరాళంగా వచ్చాయని ప్రకటించారు. తిరుమల నో ఫ్లై జోన్ విషయంపై స్టాండింగ్ కమిటీ ఫర్ హోమ్ అఫైర్స్ మెంబర్ వెంకయ్యనాయుడుతో మాట్లాడామని తెలిపారు. 50 వేల వేలమహాభారతం పుస్తకాలు ముద్రిస్తామని టీటీడీ వెల్లడించింది. భగవత్ గీత ఫౌండేషన్‌కు 40 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s