రాజధాని నిర్మాణం కోసం ఉపందుకున్న కసరత్తులు

  • స్థల సేకరణ, తాగునీటి సౌలభ్యమే ప్రధాన అజెండా
  • రిజర్వాయర్లు, నదీ పరివాహక ప్రాంతాలపై ప్రధాన దృష్టి
  • ఇప్పటికే మూడు ప్రాంతాలను పరిశీలించిన కేంద్రం
  • ప్రకాశం- కర్నూలు మధ్య అటవీ ప్రాంతం పరిశీలన
  • గుంటూరు పులిచింతల సమీపంలో రెండో ఆప్షన్
  • గోదావరి పరీవాహక ప్రాంతంపైనా ప్రత్యేక దృష్టి
  • సీమ, ఆంధ్రా ప్రాంతాలకు అనుగుణంగా నిర్ణయం


సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు, ఐదు లక్షల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే..ఇంతకీ ఆ లక్ష ఎకరాలు ఎక్కడ దొరుకుతాయన్నదే ప్రశ్నార్థకంగా మారింది. భూ సేకరణ, మౌలిక వసతుల కల్పనతో పాటు.. కొత్త రాజధానికి నీటి వనరులూ కూడా ముఖ్యమే కావడంతో.. రాజధాని నిర్మాణం ఎక్కడనేది ఆసక్తిగా మారింది.

రాష్ట్ర విభజన విషయంలో కాస్తో కూస్తో ఓ క్లారిటీ వచ్చేసింది. ఆరు నూరైనా రాష్ట్ర విభజన జరుగుతుందని తేలిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి కొత్త రాజధాని నిర్మాణం మీదే పడింది.. అయితే కొత్త రాజధాని నిర్మాణం విషయంలో ప్రధానంగా రెండు అంశాలనే కీలకంగా భావిస్తున్నారు. ఒకటి విశాలమైన స్థలం, రెండోది సాగునీరు. ఈ రెండు లభించిన చోటే కొత్తరాజధాని నిర్మాణాన్ని చేపట్టేందుకు కేంద్రం సిద్ధమౌతోంది.

భవిష్యత్ అవసరాల దృష్ట్యా సీమాంధ్ర రాజధానిని లక్ష ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని కేంద్రం భావిస్తుండటంతో.. ఆ మేరకు స్థల సేకరణపైనే ప్రధానంగా దృష్టి సారించింది.  అయితే ప్రజల నుంచి కొన్ని వందల  ఎకరాలు భూ సేకరణ చేయడం కష్టం కావడంతో.. అత్యంత వేగంగా రాజధాని నిర్మాణం జరగాలంటే అటవీ భూములను డీ నోటిఫై చేయడమే సులభ మార్గమని అధికారులు భావిస్తున్నారు.  దీంతోపాటే.. కొత్త రాజధానితో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారికి తాగునీటి సమస్య రాకుండా చూడటం మరో ముఖ్యమైన అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం నీరు ఉండే రిజర్వాయర్లు, నదీ పరివాహక ప్రాంతాలపై అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.

దీంతో సీమాంధ్ర రాజధాని కోసం  లక్ష ఎకరాలు, నీటి సౌలభ్యం ఉన్న ప్రాంతాలుగా ఇప్పటికే మూడు స్థలాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం- కర్నూలు జిల్లాల మధ్య ఉన్న అటవీ ప్రాంతాన్ని రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల రాయలసీమ వాసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారిక వర్గాల అంచనా. ఒకవేళ ఇది కుదరకపోతే.. గుంటూరు జిల్లాలోని కృష్ణానది ఒడ్డునే పులిచింతల నుంచి నీరు తీసుకొనేలా అటవీ ప్రాంతాన్ని రాజధాని నిర్మాణానికి ఉపయోగించవచ్చు. మూడో ప్రాంతంగా..  గోదావరి నది నుంచి నీరు తీసుకొనేలా.. నదీ పరివాహక ప్రాంతాల్లోని అటవీ భూములను పరిశీలించవచ్చన్నది మరో ప్రతిపాదన.  అయితే కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా.. మున్ముందు ఎలాంటి ఉద్యమాలు, ఆందోళనలు జరగకుండా అటు కోస్తా.. ఇటు రాయలసీమ ప్రాంతాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనేందుకు కేంద్రం సిద్ధమౌతోంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s