రామయ్య కోసం… ఖమ్మంవాసుల పోరాటం…

  • – జీవోఎంకు సవాల్‌గా మారిన భద్రాచలం
  • – 1324 వరకూ కాకతీయుల పాలనలో…
  • – ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు, గోడ్కొండ నవాబుల పాలన
  • – తానీషా హయాంలో రామాలయ నిర్మాణం
  • – వాజేడు, వెంకటాపురం, చర్లను బ్రిటిషర్లకు అప్పగింత
  • – 1874లో మద్రాసు ప్రెసిడెన్సీకి భద్రాచలం డివిజన్‌ అప్పగింత
  • – 1947 వరకు బ్రిటిషర్ల అధీనంలో భద్రాచలం
  • – 1953 వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే రామయ్య
  • – 1956లో రాష్ట్రం ఏర్పడ్డాక తూ.గో. జిల్లా పరిధిలోకి..
  • – పాలనా సౌలభ్యం కోసం 1959లో ఖమ్మం జిల్లాలో విలీనం

తెలంగాణవాదులు, సీమాంధ్రులు… రాముడు మావాడంటే మావాడేనని వాదించకుంటున్నారు సరే. అసలు  భద్రాచలం చరిత్ర ఏంటి. ఈ సమస్యను పరిష్కరించేందుకు చారిత్రక ఆధారాలనే జీవోఎం తవ్వితీస్తోందా?? ఇప్పుడు దీనికి ఎలాంటి పరిష్కారం చూపించబోతోంది. ఓసారి చూద్దాం.

రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత క్లిష్టమైన అంశాల జాబితాలో భద్రాచలం చేరింది. రాష్ట్రం విడిపోతే భద్రాద్రి రాముడు ఎవరికి చెందుతాడు? అన్న చర్చలు జోరందుకున్నాయి. కొందరు చరిత్రను తవ్వి తీస్తుంటే.. మరికొందరు.. వర్తమాన, పాలనా సౌలభ్యాలను.. ప్రస్తావిస్తూ.. భద్రాచలం భవిష్యత్‌పై మాట్లాడుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వానికి, విభజనపై ఏర్పడ్డ గ్రూప్‌ ఆఫ్ మినిస్టర్స్‌కు ఈ అంశం సవాల్‌గా మారింది.


చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే.. భద్రాచలం ప్రాంతం 1324 వరకు కాకతీయులు, ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు, గోల్కొండ నవాబుల పాలనలో ఉంది. 17వ శతాబ్దంలో తానీషా హయాంలో పాల్వంచ పరగణా తహశీల్దారుగా ఉన్న కంచర్ల గోపన్న రామాలయం కట్టించాడు. గోదావరి జలాలను వినియోగంలోకి తెస్తామంటూ  నిజాం హయాంలో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలను బ్రిటిష్‌వారికి బదలాయించారు. అప్పుడే కాటన్…. ధవళేశ్వరం, దుమ్ముగూడెం, ఎల్లంపల్లి వద్ద గోదావరిపై అడ్డుగోడలు నిర్మించి ధవళేశ్వరం బ్యారేజీ కట్టారు.

1874లో మద్రాసు ప్రెసిడెన్సీకి భద్రాచలం డివిజన్‌ను అప్పగించారు. దీంతో 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వమే ఈ డివిజన్‌ను పాలించింది. 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు దాకా ఈ ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక.. భద్రచాలం తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చింది. ఆ తర్వాత పాలనా సౌలభ్యం కోసం 1959లో ఖమ్మం జిల్లాలో విలీనమైంది. క్లుప్తంగా ఇదీ భద్రాచలం చరిత్ర. మరి ఇప్పుడు ఎవరికి చెందితే భద్రాచలం బాగుంటుందన్న కోణంలో జీవోఎం ఆలోచిస్తోంది. భౌగోళికంగా, పాలనా పరంగా…, ఎటువైపు ఉంటే భద్రాచలం మరింత అభివృద్ధి చెందుతున్న విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s