పూర్తైన GoM సంప్రదింపులు..

  • సంప్రదింపులకు ఫుల్‌స్టాప్‌
  • ఎల్లుండికల్లా టి-బిల్‌ రెడీ!
  • ఈ సెషన్‌లోనే పార్లమెంట్‌కి బిల్‌
  • అన్నింటికీ కాంగ్రెస్ హైకమాండ్ రెఢీ
  • బిల్లులో సమన్యాయం ఉంటుందా?
  • ముంచేది తేల్చేది హైదరాబాదేనా!
  • సీమాంధ్ర ప్యాకేజీ సంగతేంటి


టి-బిల్‌ ఫైనల్ చేయడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న జీవోఎం.. విభజనకు ఎలాంటి పరిష్కారం చూపించబోతోంది. ప్రత్యేక రాష్ట్రం కల సాకారమయ్యిందన్న సంతోషం తెలంగాణవాళ్లకు మిగులుస్తూనే.. సీమాంధ్రుల భవిష్యత్‌కి ఎలాంటి భరోసా ఇవ్వబోతోంది..?  ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. విభజనపై సంప్రదింపులు పూర్తి చేసిన మంత్రుల బృందం.. అన్ని అంశాల్ని పరిశీలించి ముసాయిదా బిల్లు రెడీ చేయబోతోంది. సాధ్యమైనంత వరకూ 21నే దాన్ని కేంద్ర కేబినెట్‌కు అందించబోతోంది.

డిసెంబర్‌ 5 డెడ్‌లైన్‌. ఏది ఏమైనా ఈలోపే టి-బిల్ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందాలి. రాష్ట్రపతికి పంపాలి. అట్నుంచి అసెంబ్లీకి రావాలి. తిరిగి కేంద్రానికి చేరాలి. ఉన్న టైమ్ చూస్తే చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో సీమాంధ్రుల ఆందోళనకు పరిష్కారం చూపిస్తూ.. పక్కాగా బిల్లు సిద్ధం చేయడం సాధ్యమేనా! కచ్చితంగా సాధ్యమే అంటోంది జీవోఎం. కీలకమైన 11 అంశాలపై పార్టీలతో సంప్రదింపులు పూర్తైనందున ఇక టి-బిల్‌కి స్పష్టమైన రూపమిస్తామంటోంది. వివిధ శాఖల రిపోర్టులు కూడా పరిశీలించామని.. ఈనెల 20, 21 తేదీల్లో మరోసారి సమావేశమై బిల్‌ ఫైనల్ చేస్తామని అన్నారు మొయిలీ.

చర్చలకు ఆఖరి మెట్టుగా నిన్న తెలంగాణ, సీమాంధ్ర కేంద్ర మంత్రులతోపాటు.. సీఎం అభిప్రాయం కూడా తీసుకున్న జీవోఎం.. వాళ్లు చెప్పిన అంశాల్ని ఎంత వరకూ పరిగణలోకి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌పై ఎవరి హక్కు ఎంతో చెప్పడం.. నదీజలాలు, విద్యుత్ పంపకాల్ని పక్కా చేయడం.. భద్రాచలం భవితవ్యం తేల్చడం.. ఇలా ఇప్పుడు కమిటీ ముందు కీలక సవాళ్లున్నాయి. సీమాంధ్రకిచ్చే ప్యాకేజీ ఎంతన్నది చెప్పడం కూడా ముఖ్యమే. సీఎం కిరణ్ లేవెనత్తిన అభ్యంతరాలు ముందరికాళ్లకు బంధాలువేసేలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో నిర్ణయం ఉంటుందని షిండే చెప్తున్నా.. సీమాంధ్రుల్ని సంతృప్తి పరచడం అంత తేలికైన విషయం కాదు. అందుకే షిండే సహా మంత్రుల బృందం సభ్యులు.. కమిటీ ముందుకు వచ్చిన వారికి పలు ప్రశ్నలు సంధించారు. సమాధానాల్నీ నోట్ చేసుకున్నారు. వాళ్ల వాదనలో హేతుబద్ధత ఉందా లేక వాళ్లు కోరేవి గొంతెమ్మె కోర్కెలా అన్నదానిపై క్లాటికీకొచ్చారు. మొత్తంగా.. తమకు అందిన 18 వేల మెయిల్స్‌లో పనికొచ్చేవేంటో తేల్చేంత ఓపికా కానీ .. టైము కానీ ఇప్పుడు లేదు కాబట్టి.. పార్టీల అభిప్రాయాలు, కేబినెట్‌ కార్యదర్శుల నివేదికలే ఇప్పుడు బిల్లుకు కొలమానమని చెప్పొచ్చు. ఏదేమైనా ఈవారంలో టి-బిల్‌ కేంద్రానికి అందడం మాత్రం ఖాయం. అక్కడితో జీవోఎం పని ముగిసినట్టే.

విభజన విషయంలో CWC నిర్ణయం ఫైనల్ అంటున్న కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌.. సీఎం కిరణ్ సహా అంతా దానికి కట్టుబడి ఉండాలన్నారు. సీమాంధ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ సంతృప్తికరంగానే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఐతే.. తమ మాట కాదని విభజనపై ముందుకెళ్తే కఠిన నిర్ణయం తప్పదని హెచ్చరిస్తున్న నాయకుల్ని హైకమాండ్ ఎలా బుజ్జగిస్తుంది.. రాజకీయ చదరంగంలో ఎలాంటి ఎత్తులు వేస్తుంది అన్నది ఆసక్తి రేపుతోంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s