• పన్నెండో రోజు కొనసాగుతున్న సువర్ణభూమి 23వ మహాపాదయాత్ర
  • గుత్తి నుంచి కల్లూరు మీదుగా గార్లదిన్నె వరకు సాగనున్న యాత్ర
  • అడుగడుగునా అయ్యప్పలకు సాదర స్వాగతం
  • ఈరోజు 30 కి.మి. కొనసాగనున్న అయ్యప్పల పాదయాత్ర


శబరిగిరీశుని దర్శనం కోసం.. సువర్ణభూమి అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర పన్నెండో రోజు  కొనసాగుతోంది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ మణికంఠుడి నామస్మరణ చేసుకుంటూ స్వాములు శబరిమల  దిశగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ గుత్తి నుంచి బయలుదేరిన స్వాములు కల్లూరు మీదుగా గార్లదిన్నె  చేరనున్నారు.

సువర్ణభూమి అయ్యప్ప స్వాముల 23వ మహాపాదయాత్ర పన్నెండో రోజూ దిగ్విజయంగా కొనసాగుతోంది. రాత్రి  గుత్తిలో బసచేసిన స్వాములు పూజలు, భజనలతో మణికంఠుడి సేవలో నిమగ్నమయ్యారు. వేకువజామునే  స్వాములు పూజా కార్యక్రమాలు ముగించుకుని పాదయాత్ర మొదలుపెట్టారు. వడివడిగా అడుగులు వేస్తున్న  అయ్యప్పలు మధ్యాహ్నానికి కల్లూరు చేరుకుంటారు. అక్కడే భిక్ష చేసి కాసేపు సేదతీరతారు. అనంతరం పాదయాత్ర  సాగించి సాయంత్రానికి గార్లదిన్నె చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు…

నిన్న 28 కిలోమీటర్ల మేర స్వాములు యాత్ర చేశారు. దీంతో ఇప్పటివరకూ 332 కిలోమీటర్ల మేర పాదయాత్ర  పూర్తయింది. ఇవాళ 30 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నారు. నడక అలవాటవడంతో స్వాములు పాదయాత్ర  స్పీడు పెంచారు. ఇన్నాళ్లు కాళ్లనొప్పులతో ఇబ్బందిపడిన స్వాములు ఇప్పుడు నిర్దేశించిన సమయం కంటే ముందే  గమ్యాన్ని చేరుకుంటున్నారు..

అయ్యప్ప స్వాముల పాదయాత్రకు కార్తీక మాసం కలిసివస్తోంది. పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత నుంచి  క్రుష్ణ, తుంగభద్ర వంటి పవిత్ర నదులతోపాటు మార్గమధ్యంలో ఉన్న ఆలయాల వద్ద కార్తీక స్నానాలు చేస్తున్నారు. ఈ  12 రోజుల్లో ఏదో ఒక ఆలయంలో పూజలు, భిక్ష చేసే భాగ్యం కలిగింది. మొత్తానికి శివకేశవులకు సంబంధించిన ఈ  పవిత్ర మాసంలో అన్ని పుణ్యఫలాలు పొందే భాగ్యం కలిగిందంటున్నారు అయ్యప్ప స్వాములు.   సువర్ణభూమి పాదయాత్రలో 150 మంది అయ్యప్పలు భాగస్వాములయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి  వచ్చినవారు బృందాలుగా మణికంఠుడి సన్నిధివైపు కదులుతున్నారు. స్వాములు పయనిస్తున్న మార్గమంతా  అయ్యప్ప శరణుఘోషతో మార్మోగుతోంది….

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s