ఇవాళ మమతా బెనర్జీతో జగన్ భేటీ..

  • వేగంగా పావులు కదుపుతున్న జగన్
  • సార్వత్రిక ఎన్నికలు, సమైక్య పోరుపై గురి
  • కోల్‌కతా, లక్నో పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
  • ఇవాళ కోల్‌కతా, రేపు లక్నో  టూర్..
  • మమతా, అఖిలేష్‌ యాదవ్‌తో సమావేశాలు
  • విభజనకు వ్యతిరేకంగా మద్ధతు కోరనున్న జగన్

సమైక్యాంధ్ర ఛాంపియన్‌గా నిలవడం,  సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ద్వారా  2014 ఎన్నికలకు క్యాడర్‌ను రెడీ చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ దృష్టి సారించారు. అందులో భాగంగానే  ఓవైపు  పార్టీ విసృతస్థాయి సమావేశం నిర్వహించి, క్యాడర్‌కు  దిశానిర్దేశం చేశారు.  మరో వైపు ఉత్తరాది రాష్ట్రాల పర్యటనకు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతించడంతో  సమైక్యాంధ్రకు జాతీయ పార్టీల మద్ధతు కూడగట్టేందుకు జగన్‌ సమాయత్తమవుతున్నారు.


సమైక్యాంధ్ర ఉద్యమంలో ఛాంపియన్‌గా అవతరించేందుకు జగన్ రెడీ అవుతున్నారు. విభజన ప్రకటన తర్వాత సీమాంధ్రలో పార్టీశ్రేణులు ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనేలా చేసిన జగన్‌, ప్రస్తుతం ఉద్యమాన్ని తానే అయి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. విభజనను అడ్డుకునేందుకు కలిసిరావాలని జాతీయ స్థాయి నేతలను కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటించేందుకు  సీబీఐ కోర్టు అనుమతి లభించడంతో ఇవాళ జగన్ కోల్‌కతాకు వెళ్తున్నారు. అక్కడ  పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీని కలుస్తారు. అలాగే రేపు  లక్నోలో యూపీ సీఎం అఖిలేష్‌యాదవ్‌తో భేటీ కానున్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జాతీయ నాయకుల మద్ధతు సాధించమే లక్ష్యంగా జగన్  ఈ టూర్ వెళ్తున్నారు.   విభజన వల్ల తలెత్తే సమస్యలను జగన్ వారికి వివరించనున్నారు. పార్లమెంటులో విభజన బిల్లును వ్యతిరేకించాలని వారిని కోరనున్నారు. మరోవైపు.. పార్టీని సంస్థాగతంగా బలోపేతంచేసి, సార్వత్రిక సమరానికి  పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా  ఏడాదిన్నర తర్వాత పార్టీ విస్తృత స్థాయి సవావేశం నిర్వహించిన జగన్, క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ప్రజల్లోకి వేళ్లాలని పిలుపు నిచ్చారు. ఇప్పుడు జాతీయ నాయకులతో చర్చల ద్వారా ఉద్యమకారుల్లో మరింత ఉత్సాహం నింపుతున్నారు…

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s