తరుముకొస్తున్నగండం

  • వాయువేగంతో దూసుకొస్తున్న హెలెన్
  • నెల్లూరు, మచిలీపట్నం మధ్యతో తీరం దాటే అవకాశం
  • నష్టం స్థాయి భారీగా ఉండే అవకాశం
  • తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • దక్షిణ అండమాన్ మహాసముద్రంలో మరో అల్పపీడనం
  • డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రానికి తుఫాన్ల గండం

రాష్ట్రంపై తన ప్రభావాన్ని చూపించేందుకు వాయువేగంతో హెలెన్ తుఫాను దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ పెను తుపాను ఇవాళ సాయంత్రంకల్లా తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీరప్రాంత జిల్లాల్లో హెలెన్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. ఇవాళ ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది.
For Video Click Here
హెలెన్ తుపాను అంచనాల్ని తలకిందులు చేస్తూ ప్రయాణిస్తోంది. మంగళ, బుధవారం నాటి పరిస్థితుల్ని బట్టి ఒంగోలు, కావలి ప్రాంతాల్లో హెలెన్  తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే అనూహ్యంగా గురువారం కల్లా హెలెన్ దిశ మార్చుకొని, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ  దిశగా 180కి.మీ దూరంలో హెలెన్ కేంద్రీకృతమైంది. అయితే  శుక్రవారం సాయంత్రం కల్లా.. నెల్లూరు,మచిలీపట్నం మధ్య ఒంగోలు సమీపంలో హెలెన్ తీరం  దాటే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తుపాను మెల్లగా కదులుతుండడంతో నష్టం స్థాయి ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉందని, మరీ  ముఖ్యంగా ఉత్తరకోస్తాంధ్రప్రాంతంపై హెలెన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో 75 నుంచి  120 కి.మీ. మధ్య వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు తేల్చారు.

మరోవైపు హెలెన్ ముప్పు నుంచి ఇంకా బయటపడక ముందే మరో గండం పొంచి ఉన్నట్టు వాతావరణశాఖ  ప్రకటించింది. దక్షిణ అండమాన్ ప్రాంతంలోని మహా సముద్రంలో అల్పపీడనం ఉన్నట్టు అధికారులు అంచనాకొచ్చారు. ఇది మరింత బలపడి తుపానుగా కూడా మారే ప్రమాదం ఉందని, దీని  వల్ల కోస్తాంధ్రకూ తీవ్ర స్థాయిలో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రానికి తుపాన్ల గండం తప్పదని, గతంలో  కూడానెలరోజుల వ్యవధిలో మూడుమార్లు తుపాన్లు ఏర్పడిన సందర్భాలున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s