తమిళనాడులోని కూడంకుళం సమీపంలోని ఇడిందకరై గ్రామంలో నాటుబాంబు పేలుళ్లలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కూడంకుళం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న కమిటీ సునామీ కాలనీలో నివాసం ఉండడంతో ఈ ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కి పడింది. ఇంట్లో ఉన్న నాటు బాంబులు పేలడంతో ఆరుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పేలుళ్ల ధాటికి రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలానికి అగ్నిమాపక, పోలీసుల బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై విచారణ జరిపిస్తున్నామని తిరునెల్వేలి జిల్లా ఎసపీ విజయేంద్ర తివారీ చెప్పారు.
కూడంకుళం సమీపంలోని ఇదింతకారి గ్రామంలో నాటుబాంబులు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన న్యూక్లియర్ పవర్ ప్లాంటుకు సమీప గ్రామంలో సంభవించింది. అయితే కూడంకుళం నివాసాల్లో నాటుబాంబులు పేలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.