4 నెలల తర్వాత రాష్ట్రానికి స్వర్ణయుగం

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఉడా కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటించిన జగన్, వారికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పర్యటించనున్నారు.


కోనసీమ వరద బాధితులకు YCP చీఫ్‌ జగన్ అండగా నిలిచారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించిన జగన్‌ వారికి దైర్యం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి పర్యటన ప్రారంభించిన జగన్ అవిడి, ఎన్ చిన్నపాలెం గ్రామాలలో తుపాను, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. అరటి తోటలు, పంట పొలాలను పరిశీలించి బాధిత రైతులను  ఓదార్చారు. ముమ్మడివరం మండలం చెయ్యేరులో ముంపుకు గురైన పంటపొలాల్లోకి దిగిన జగన్, బురదలో నాని మెలకలు వచ్చిన వరికంకులను పరిశీలించారు. బురదలోనే రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు.

కాట్రేనికోన, ఉప్పలగుప్తం,పి గన్నవరం, రాజోలు మండలాల్లోనూ వరద బాధితులను యువనేత పరామర్శించారు. తమ పరిస్థితి దారుణంగా ఉందని ఈ సందర్బంగా జగన్ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీలం తుపాన్‌ నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని  రైతులు చెప్పినప్పుడు  ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసుగా రెండు తుపాన్‌లు వచ్చినా  పాలకులు రైతులను ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తుపానులు, అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, పేదలను ఆదుకోని ఈ పాలకులకు మనసు ఉందా అని జగన్‌ ప్రశ్నించారు. రైతుల కష్టాలపై సీఎంకు లేఖ రాస్తానని చెప్పిన యువనేత, రైతుల రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు. వరుస తుపాన్లతో రైతులు, మత్స్యకారులు నష్టపోతున్నా..ప్రభుత్వం కనీనం కేజీ బియ్యం, లీటర్ కిరోసిన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు తక్షణ సాయంగా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. నాలుగు నెలలు ఓపిక పడితే రాబోయే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తుపాను బాధితులందరికీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.

హెలెన్ తుపాను ప్రభావానికి గురైన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో ఇవాళ జగన్  పర్యటించనున్నారు. మూడు నియోజకవర్గాల్లో తీవ్రంగా దెబ్బతిన్న వరి పొలాలు, ఉప్పు మడులు, కొబ్బరి, అరటి తోటలను  పరిశీలించి, బాధిత రైతులను పరామర్శించనున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s