వాయుగుండంగా తీరం దాటిన లెహర్‌

లెహర్ తుపాను మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటింది. తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారడంతో పెనుముప్పు తప్పింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రాతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురవనున్నాయి. పైలిన్, హెలెన్ తుపాన్లతో రైతన్నలు రోడ్డున పడ్డారు. మరో 24 గంటల పాటు వర్ష గండం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు.


మూడు రోజుల పాటు కోస్తా జిల్లాలను వణికించిన లెహర్ తుఫాను తీరం దాటే సమయానికి శాంతించింది. పెను తుపాను రాకపై సర్వత్రా అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆర్మీ బలగాలతో పాటు NDRF బృందాలు బందరుకు చేరాయి. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కాగా.., లెహర్ క్రమేణా బలహీనపడటంతో కోస్తా జిల్లాల ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.అటు దీని ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు.. యానాం, తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది. లెహర్ తుపాను ప్రభావం నామ మాత్రమే కావడంతో రెవిన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

మరో వైపు అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 55 కి.మీ వేగంతో గాలులు వీయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు వాతావరణ కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. అటు గాలుల వేగం తగ్గడంతో ఓడ రేవుల్లో ఎగరవేసిన ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. అల్పపీడన ప్రభావంతో కోస్తా, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. lనిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో జనజీవనానికి ఇబ్బంది తలెత్తింది. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్‌ ఇస్తోంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s