• 14ఎఫ్‌ తొలగింపు కోసం కేసీఆర్‌ దీక్ష
 • 2009, నవంబర్‌ 29న దీక్ష
 • 11 రోజులు దీక్ష చేసిన కేసీఆర్‌
 • తెలంగాణలో మోహరించిన పోలీసులు
 • ఏకమైన తెలంగాణ వాదులు
 • మార్గమధ్యలోనే కేసీఆర్‌ అరెస్ట్‌
 • రణరంగమైన ఓయు, కేయు
 • రెండోరోజే కేసీఆర్‌ దీక్ష విరమణంటూ వార్తలు
 • తిరుగుబాటకు దిగిన విద్యార్ధులు
 • దీక్ష కొనసాగించిన కేసీఆర్‌
 • డిసెంబర్‌ 9న తెలంగాణపై ఢిల్లీ ప్రకటన
 • దగ్గర పడుతున్న తెలంగాణ ఏర్పాటు
 • దీక్షా దివాస్‌గా సంబరాలు

తెలంగాణా ఉద్యమ ప్రస్థానంలో ఆ దీక్ష మరుపురానిది. ఎన్నో ఏళ్ల నుండి సాగుతున్న తెలంగాణా ఉద్యమాన్ని అనూహ్య మలుపు తిప్పింది ఆ దీక్షాస్ర్తం. కేసీఆర్‌ సచ్చుడో…తెలంగాణా వచ్చుడో అంటూ దీక్షకు దిగిన ఆ ఉద్యమ  నేత…అన్నంత పని చేశారు. తన దీక్షాస్ర్తంతో కేంద్రం మెడలు వంచి తెలంగాణాపై ప్రకటన చేయించారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే ఇప్పుడు తెలంగాణా ఏర్పాటు దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. కేసీఆర్‌ సంధించిన ఆ దీక్షాస్ర్తానికి నేటికి నాలుగేళ్ళు.


ఓట్లు, సీట్లే తప్పా టిఆర్‌ఎస్‌తో అయ్యేదేమీ లేదనే విమర్శలు. ఆ ఓట్లు, సీట్లలోనూ చావుతప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి. టిఆర్‌ఎస్‌ దుకాణం ఇక బందేనంటూ తెలంగాణావాదులే దాడికి దిగుతున్న సందర్భం. అలాంటి విపత్కర పరిస్థితిల్లో అంది వచ్చిన అస్ర్తమే 14 ఎఫ్‌. రాజ్యాంగంలోని 14 ఎఫ్‌ను తొలిగించేందుకు రంగంలోకి దిగారు టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. 2009 నవంబర్‌ 29న 14 ఎఫ్‌ అస్ర్తంగా కేసీఆర్‌ సచ్చుడో…తెలంగాణా వచ్చుడో అంటూ ప్రారంభించిన ఆమరణ దీక్షతో యావత్తు తెలంగాణా ఏకమైంది. తొలిసారిగా ఓట్ల రాజకీయాలు పక్కన బెట్టి ఉద్యమ పంధాలోకి వెళ్లిన కేసీఆర్‌కు తెలంగాణా జనం నీరాజనాలు పట్టారు. తొమ్మిదేళ్లుగా రాజకీయ పార్టీ అధినేతగా చేయలేని పనిని…11 రోజుల దీక్షతో సాధించారు కేసీఆర్‌. నవంబర్‌ 29 న సిద్దిపేటలో వేలాది మందితో దీక్షకు దిగనున్నట్లు కేసీఆర్‌ చేసిన ప్రకటనను మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే దీక్షా సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణావాదులంతా ఏకమయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య దీక్షను అడ్డుకునేందుకు భారీగా పోలీసులను ప్రయోగించారు.

ఉత్తర తెలంగాణభవన్‌ నుంచి సిద్దిపేటలోని దీక్షా స్థలికి బయలుదేరిన కేసీఆర్‌ను మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో తెలంగాణా ఒక్కసారిగా భగ్గుమంది. విద్యార్థులు, తెలంగాణావాదులు రోడ్డెక్కారు. అరెస్ట్‌లు, భాష్పవాయు ప్రయోగాలతో కేయూ, ఓయూలు రణరంగాన్ని తలపించాయి. రెండు రోజులకే కేసీఆర్‌ దీక్ష విరమించారనే వార్తలతో విద్యార్థులు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కేసీఆర్‌పైనే యుద్దం ప్రకటించారు. ఆ తర్వాత దీక్ష యధావిధిగా సాగుతుందని కేసీఆర్‌ ప్రకటించగా…రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణా యావత్తు ఏకమైంది. కేసీఆర్‌ దీక్షకు మద్దతుగా డిసెంబర్‌10న ఛలో అసెంబ్లీకి విద్యార్థిలోకం పిలుపునిచ్చింది. రోజురోజుకూ తెలంగాణాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో కేంద్రం దిగివచ్చింది. డిసెంబర్‌ 9నే తెలంగానా ఏర్పాటుపై అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేయడంతో తెలంగాణావాదుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

అయితే సీమాంధ్ర ప్రాంతం నుంచి నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో బ్రేక్‌ పడ్డ తెలంగాణా ఏర్పాటు మళ్లీ పట్టాలెక్కింది. యుపిఏ, సిడబ్ల్యూసీల నిర్ణయంతో రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. వచ్చే నెలాఖరులోగా తెలంగాణా ఏర్పాటు ఖాయమని భావిస్తున్న తెలంగాణావాదులు…కేసీఆర్‌ దీక్షకు దిగిన నవంబర్‌ 29ని దీక్షాదివస్‌గా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s