టీవీ5 ఆధ్వర్యంలో ఆది దంపతుల కళ్యాణం

మాసాల్లో అత్యంత పవిత్ర మాసం కార్తీకం. అందునా మాస శివరాత్రి, ప్రదోశ వేళ టీవీ ఫైవ్‌ కన్నుల పండువగా నిర్వహించిన ఆది దంపతుల కల్యాణశోభ ప్రపంచం నలు దిక్కులా ప్రసరించింది. లోక కల్యాణం కోసం చేపట్టిన ఈ అపురూప ఘట్టం ఆద్యంతం.. అత్యంత భక్తి ప్రపత్తులతో… ఓం నమశ్శివాయ మంత్ర జపంతో.. సాగింది.

For Video Click Here

సృష్టి…., స్థితి లయకారుడు శంకరుడు, జగజ్జనని, లోకమాత పార్వతీ దేవి కల్యాణశోభతో భాగ్యనగరి పులకించిపోయింది. అత్యంత కమనీయం.., వైభవోపేతంగా సాగిన శివపార్వతుల కల్యాణం.. భక్తజన కోటిని ఆధ్యాత్మిక భావనలోకి తీసుకెళ్లింది. ఆది దంపతుల కల్యాణ వీక్షణంతో… ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కించుకుంది భక్తజనం. కార్తీక మాసం.., మాస శివరాత్రి.. ప్రదోశ కాలంలో.. ఒక్కసారి ఓంనమశ్శివాయ చెప్పినా.. కోటి సార్లు చెప్పిన పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఆ సత్సంకల్పంతో లోక కల్యాణార్థం.. టీవీ5 నిర్వహించిన ఆది దంపతుల వివాహ మహోత్సవం.. కన్నుల పండువగా సాగింది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి భాగ్యనగరం నలుమూలల నుంచే కాకుండా… వివిధ జిల్లాల నుంచీ భక్తులు హాజరయ్యారు. కల్యాణం జరుగుతున్నంత సేపూ.. అశేష భక్తజన వాహిని భక్తిభావంతో పులకించిపోయింది.

మొదటగా జ్యోతి ప్రజ్వలనతో కళ్యాణోత్సవం ప్రారంభమైంది. టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్, వైస్ ఛైర్మన్ సురేంద్రనాథ్, డైరెక్టర్ బల్వంత్ రెడ్డి జ్యోతి ప్రజల్వన చేశారు. కమనీయం, రమణీయం, జగద్విఖ్యాతమైన పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి జగద్గురు పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతి.. శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతి స్వామీజీ సహా.. పలువురు పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు. విద్యానృసింహ భారతి స్వామీజీ అనుగ్రహ భాషణంలో భక్తజనం తన్మయత్వానికి గురైంది. బ్రహ్మశ్రీ కొడగండ్ల శ్రీరామశర్మ ఆధ్వర్యంలో.. కల్యాణ ఘట్టం… కైలాసంలోనే జరిగిందా అన్నట్లు… శోభాయమానంగా సాగింది. శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో.. శివకీర్తనలు.., ప్రత్యేక దీప నృత్య ప్రదర్శనలు.., శివలీలలు నృత్యరూపకం.., పేరిణి శివతాండవం.. ఆద్యంతం  ఆకట్టుకున్నాయి.

శివభక్తుడు, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి.. తన శివతత్వంతో, శభాష్‌రా శంకరా కావ్యంతో భక్తజనాన్ని మైమరపించేలా చేశారు. గుడి నుంచి శివుడిని గుడిసెకు తీసుకెళ్లడమే ధ్యేయమన్నారు. శంకరుడి కీర్తిని వేనోళ్లా పొగిడి.. తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వీరితో పాటే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు వీణాపాణి, ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.

శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామీజీ… శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని తిలకించి.. భక్తజనానికి అనుగ్రహ భాషణం చేశారు. శివపార్వతుల కల్యాణ వైశిష్ట్యాన్ని వివరించారు. కార్యక్రమానికి హాజరైన అతిరథ మహారథులను టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనానికి రుద్రాక్షలు, గంగా జలాన్ని అందించారు. కల్యాణ వేడుకకు మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s