రేణుకాచౌదరి, రాంరెడ్డి వెంకటరెడ్డి మధ్య భగ్గుమన్న విభేదాలు

  • ఖమ్మం కాంగ్రెస్‌లో ఇంటిపోరు
  • ఖమ్మంజిల్లాలో రేణుకాచౌదరిని పార్టీకి దూరం చూసే వ్యూహం
  • ఎన్నికల్లో పోటీచేస్తామన్న రేణుక ప్రకటనతో నాయకులల్లో గుబులు

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు ముదురు పాకాన పడుతోంది. ఓ వైపు రాజ్యసభ సభ్యురాలు  రేణుకా  చౌదరి,  మరోవైపు  మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో వర్గ పోరు నడుస్తోంది. ఇరు వర్గాల కార్యకర్తల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. జిల్లాలో ఇప్పుడు భద్రాద్రి అంశం కన్నా కాంగ్రెస్‌ రాజకీయాలపైనే ఎక్కువ చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు జిల్లా కాంగ్రెస్‌ నాయకుల మనోభావాలు ఎలావున్నాయో  చూద్దాం!

For Video Click Here

ఖమ్మంజిల్లా   రాజకీయాలు ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతుంటాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతూనే వుంటాయి. ఇక ఇప్పుడు ఆ పార్టీలో నెలకొన్న వర్గపోరు  మరోమారు చర్చనీయాంశంగా మారి పబ్లిక్‌లో పెద్ద చర్చ లేవదీసింది. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యపాత్రలు మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి. రేణుకకు  మొదటి నుంచి ప్రత్యేక తెలంగాణపై  పెద్దగా ఆసక్తి లేదన్నది బహిరంగరహస్యం. అయితే పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రకటన చేసిన తరువాత జిల్లా పార్టీలో వర్గపోరు ఒక్కసారిగ విజృంభించింది. జిల్లా పార్టీలో తిరుగులేని రేణుకను దెబ్బతీయటానికి ఆమె ప్రత్యర్థి వర్గం ఇదే సరైన సమయమని భావించింది. ఉన్నట్టుండి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అసలు ఆమె ఖమ్మం ఆడబిడ్డ కాదంటూ వ్యాఖ్యానించారు. ఇక అక్కడి నుంచి మొదలైన విభేధాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గిన సూచనలు కనిపించలేదు. ఇక ఇదే సమయంలో భద్రాచలం అంశం తెరమీదకు వచ్చింది. దీనిపై  రేణుక ఉద్యమించారు.  అయితే ఆమె ప్రత్యర్థి వర్గానికి ఇది ఏమాత్రం రుచించలేదు..ఆమె పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు. కాన్వాయ్‌పై కోడి గుడ్లు విసిరారు.దీనిపై ఆమెకూడా తీవ్రంగానే స్పందించారు.

మరోవైపు, రేణుకా చౌదరి రెండు రోజుల పర్యటనలో ఖమ్మం టిక్కెట్టును ఆశిస్తున్న అజయ్‌కుమార్‌, యూనిస్‌ సుల్తాన్‌లను వెంటతీసుకుని తిరగడాన్ని ఆపార్టీవర్గీయుల్లో చర్చనీయాంశమైంది. ఖమ్మం స్థానంకోసం మంత్రి అనుచరుడైన రాధాకిషోర్ కూడా ఆశిస్తుండటంతో రాజకీయ వివాదంలో ఆజ్యం పోసినట్టయింది. దీంతో జిల్లా రాజకీయాలు కొత్త మలుపుతిరుగుతున్నట్టు కనిపిస్తోంది.  రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న రేణుకాచౌదరి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ఆపార్టీ నాయకుల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంతకీ రాబోయే  రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయోనని అంతుబట్టకుంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s