విభజనను అడ్డుకోవాలని తమిళనేతలకు జగన్ విజ్ఞప్తి

రాష్ట్ర విభజన జరకుండా చూడాలని తమళపార్టీల మద్దతు కూడగట్టారు YCP అధినేత జగన్‌. చెన్నై వెళ్లిన యువనేత తమిళనాడు సీఎం జయలలితతో, DMK అధినేత కరుణానిధితో భేటీ అయ్యారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న YCP విజ్ఞప్తిపై ఇద్దరు నేతలు సానుకూలంగా స్పందించినట్లు జగన్‌ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకోవాలంటూ వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్న YCP అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తమిళనాడు వెల్లారు. చెన్నై చేరుకున్న జగన్‌ బృందానికి సమైక్యవాదులు, YCP అభిమానులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌ పాటిస్తున్న దుర్నితీని జగన్‌ జయకు వివరించారు. యువనేత చెప్పిన విషయాలను సావదానంగా ఆలకించిన జయలలిత… సానుకూలంగా స్పందించారు.

సాయంత్రం డీఎంకే అధినేత కరుణానిధితో జగన్‌ 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. కరుణ నివాసానికి వచ్చిన యువనేతకు ఆయన కుమారుడు స్టాలిన్‌, కూతురు కనిమొళి స్వాగతం పలికారు.Spot
రాష్ట్ర విభజనలో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని కరుణానిధికి వివరించారు జగన్‌. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం ఎడారిగా మారి తెలుగు ప్రజలంతా నష్టపోయే అవకాశం ఉన్నందున సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలపరచాలని కోరారు.  ఏపీ విభజన అంశం చాలా ముఖ్యమైందని ఇద్దరు నేతలు అన్నారని జగన్‌ మీడియాకు వెల్లడించారు.చెన్నై విమానాశ్రయంలో జగన్‌కు అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. పూల వర్షం కురిపించి టపాసులు పేల్చారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s