అవిశ్వాస నోటీస్ ఇచ్చిన టీడీపీ, వైసీపీ

  • 50 మంది సభ్యుల మద్దతుంటే చర్చకు అనుమతి

అవిశ్వాసం తమకు పరీక్షేనంటున్న కాంగ్రెస్.. దాన్ని ఎదుర్కొంటామని పైకి  ధీమాగానే చెప్తోంది. బీజేపీ ఈ నోటీస్‌కు మద్దతిస్తే పరిస్థితి ఏంటన్నదానిపైనా  లెక్కలేసుకుంటోంది. అటు… ఏది ఏమైనా ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడమే  తమ లక్ష్యమంటూ టీడీపీ, వైసీపీ కూడా విడివిడిగానే తమ పోరాటం  కొనసాగిస్తున్నాయి. ఈ పరిణామాలు  హస్తం పార్టీకి మింగుడు పడడం లేదు. 50 మంది మద్దతిస్తే అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో.. ఎవరికివారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

kulchedam-rabiggggg
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో డీలాపడ్డ కాంగ్రెస్‌ను పూర్తిగా పాతాళంలోకి తొక్కేసేందుకు విపక్షాలు పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్  చావే   లక్ష్యంగా టీడీపీ, వైసీపీ కూడా అవిశ్వాస నోటీస్‌తో సిద్ధంగా  ఉన్నాయి. ఇవాళ టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ లోక్‌సభలో నోటీస్‌ను ప్రవేశపెడతారు. పార్టీకి చెందిన మిగతా ఎంపీలు ఎన్. శివప్రసాద్‌, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల క్రిష్ణప్పతో కలసి ఇప్పటికే ఆయన స్పీకర్‌కు ఇవ్వాల్సిన పేపర్స్ ఇచ్చారు. నిన్న ఉభయసభల్ని స్తంభింపచేసిన టీడీపీ ఎంపీలు ఇవాళ అవిశ్వాసం అంశం ప్రస్తావనకు రాకపోతే తమ నిరసన తెలపాలని నిర్ణయించారు. అటు, అసెంబ్లీలోనూ అవిశ్వాసానికి సై అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంకేతాలు  ఇచ్చారు.

జగన్ సైతం.. కాంగ్రెస్‌ పతనాన్ని శాసించాలని.. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు  ఇటీవలే వైసీపీలో  చేరిన ఎస్.పి.వై రెడ్డితో కలసి సంతంకం చేసిన నోటీస్‌ను స్పీకర్‌కు పంపారు. తాము కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు.

అటు, ఎవరు నోటీస్ ఇచ్చినా కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉంటేనే అవిశ్వాసంపై సభలో చర్చకు వీలుంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో 19 మంది ఎంపీలున్నా.. సంతకం చేసింది ఆరుగురే. టీడీపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి ముగ్గుర్ని కలుపుకుంటే.. 13 మంది అవిశ్వాసానికి సై అంటున్నారు.

ఇవాళ స్పీకర్ అవిశ్వాసం నోటీస్‌ను పరిగణనలోకి తీసుకుని.. సభ అభిప్రాయం కోరితే అప్పుడు మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 10 శాతం అంటే 50 మంది దాన్ని బలపరచాలి. ఈ బలాన్ని సమీకరించేందుకు.. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతోపాటు, టీడీపీ, వైసీపీ నేతలు తమతమ ప్రయత్నాల్లో  బిజీగా ఉన్నారు. ఇవాళ నోటీస్‌ను స్పీకర్ ప్రస్తావించాక దానికి సరిపడ  మద్దతు లబిస్తే.. అన్ని రాజకీయపక్షాలతో చర్చించి.. అవిశ్వాస తీర్మానం ఏ రోజున పెట్టాలి? చర్చకు ఎంత సమయం కేటాయించాలి.. ఓటింగ్ మాటేంటి అన్నది తేలుతుంది.

Advertisements
Image | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s