ఆ గ్రామంలో అందరి వయసు 112 సంవత్సరాలు…

ఆ గ్రామంలో అందరి వయసు 112 సంవత్సరాలు. ఇదేమిటి ..ఎలా సాధ్యం  అనుకుంటున్నారా? కాని నిజం ..అధికారులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. వివరాలు మీరే చూడండి!

ఇది మెదక్ జిల్లా సిద్దిపేట మండలం నారాయణరావుపేట.12  వందలకు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అందరి వయస్సు 112  సంవత్సరాలే. రేషన్‌కార్డుల జారీ చేసినపుడు ఊరు ప్రజలందరి వయసు 112 ఏళ్లుగా  పేర్కొన్నారు. చిన్న పిల్లవాడి నుండి పండు ముసలి వరకూ అందరిదీ ఇదే వయస్సు. ఒకరికో ఇద్దరికో అయితే పొరపాటు అనుకోవచ్చు. గ్రామంలోని ఒకరిద్దరి ఇళ్లకు తప్ప అందరి విషయంలో ఇలాగే జరిగింది.

 

ration-card-bigggggggg

కార్డులు జారీ చేసే సమయంలోనూ అధికారులు దీనిని పరిశీలించలేదు. దీంతో వయస్సు ధ్రువీకరణ కోసం రేషన్‌కార్డును వాడేపరిస్థితి కనిపించడం లేదు. చదుకున్న వారికి కనీసం పదో తరగతి మెమో అయినా ఉంటుంది. చదువుకోని వారికి రేషన్‌కార్డే దిక్కు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు.

ఈ కార్డులు జారీ చేసి ఏడాది దాటింది.  దీనిని సవరించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతోందని ఊరు ప్రజలు అంటున్నారు. ది. తాలుకా స్థాయిలో రేషన్‌కార్డుల సవరణకు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s