తుఫాన్ ఎఫెక్ట్‌తో కోస్తాలో తగ్గిన తీవ్రత..పలుచోట్ల చిరుజల్లులు

  • రాష్ట్రంపై చలిపులి పంజా
  • పెరిగిన శీతల గాలులు
  • తెలంగాణ జిల్లాలు గజగజ
  • పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు

చలి పులి రాష్ట్రాన్ని  గజగజలాడిస్తోంది. శీతల గాలులు పెరగడంతో రాత్రి, పగలు తేడా లేకుండా చలి తీవ్రత పెరుగుతోంది. చలి పంజా దెబ్బకు  తెలంగాణ జిల్లాలు విలవిలలాడి పోతున్నాయి.  గతేడాదితో పోల్చితే  కనిష్ఠ ఉష్ణోగ్రతలు  4నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.

chali-panjabigggggg
రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో జనం గజగజ వణికి పోతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్య ఇళ్లల్లోంచి బయటకు రావాలంటే వణికి పోతున్నారు. చలి తీవ్రత పల్లెలు, అటవీ సమీప గ్రామాల్లో అధికంగా ఉంటోంది.  ఉత్తర దిశలో వీస్తున్న శీతల గాలుల కారణంగా ఉదయం 10 గంటల వరకు చలి వణికిస్తోంది. మరోవైపు సాయంత్రం సూర్యాస్తమయం కాకమునుపే చలి తీవ్రత పెరిగి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటల ముందు కాలం వెళ్లదీస్తున్నారు.

ఒడిశా, మధ్యవూపదేశ్ మీదుగా ఉత్తర దిక్కునుంచి శీతల గాలులు రాష్ట్రంవైపు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో దట్టమైన పొగమంచు ఏర్పడుతోందని వాతావరణ అధికారులు అంటున్నారు. అంతేకాకుండా నిర్విరామంగా చలిగాలులు తమ ప్రతాపాన్ని చూపి వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి. దీంతో తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో పాటు శీతల గాలులు పెరుగుతున్నాయి.  గతేడాదితో పోల్చితే 4నుంచి 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి.  ఆదిలాబాద్ జిల్లాలో వారంరోజుల కింద 15 డిగ్రీలు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత ఒక్కసారిగా సగానికి పడిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ చలి కౌగిట్లో గజగజలాడి పోతోంది..

ఇక రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయల సీమల్లోను చలి పెరుగుతోంది. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, ఒంగోలు జిల్లాల్లో మినహా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు రోజులు కంటే  రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గాయి.రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు  మరింత తగ్గుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisements
Image | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s