హైదరాబాద్‌లో లోక్‌సత్తా సదస్సు

  • అవినీతి అంతం అసాధ్యం కాదు..: జేపీ
  • ఉపన్యాసాలతో నిర్మూలన అసాధ్యం..

ఉపన్యాసాలతో అవినీతి నిర్మూలన సాధ్యం కాదని మేధావులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీకి, రాష్ట్రంలోని లోక్‌సత్తా పార్టీకి ఉన్న వ్యత్యాసం అదేనని చురకలంటించారు. మరోవైపు.. అవినీతి అంతం అసాధ్యమైన విషయమేమీ కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు.

0213247945636biggggg
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో లోక్‌సత్తా సదస్సు నిర్వహించింది. సమాజంలో అవినీతిని అంతం చేయాలని, నీతివంతమైన రాజకీయాలు రావాలనుకునేవారు.. తమ లక్ష్యసాధన కోసం ప్రజలతో కలిసి పోరాడాలని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ సూచించారు. ఎమ్మార్వో, కండక్టర్ల అవినీతిని ప్రశ్నించే ప్రజలు కార్పోరేట్‌ ఫ్రాడ్‌లను ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. ప్రజా చైతన్యమే అన్ని సమస్యలకు పరిష్కారమని నాగేశ్వర్‌ అన్నారు.

అవినీతి అంతం అసాధ్యమైన విషయం కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. తమ పార్టీ లక్ష్యం కూడా అదేనన్నారు. అవినీతికి వ్యతిరేకంగా, నీతివంతమైన రాజకీయాలకోసం లోక్‌సత్తా చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని జేపీ పిలుపునిచ్చారు. లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టాలు బలంగా రావాలని, ఎన్నికల సంస్కరణలు, పాలనావ్యవస్థలో మార్పులు రావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో రాజకీయ జ్యోక్యాన్ని నిరసించారు. అన్నిటికిమించి ప్రజల్లో చైతన్యం రావాలన్నారు.

Advertisements
Image | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s