తెలంగాణ సీఎం పీఠంపై కన్నేసిన జైపాల్

కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి తెలంగాణ సీఎం పీఠంపై కన్నేశారా..? అందుకే ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారా..? అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ నుంచే ఆయన పోటీ చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. మరి.. జైపాల్‌కు పాలమూరు వాసులు జై కొడతారా..? భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి  పంపిస్తారా..?

Jaipal-Reddy_20101127.jpg.ashx
విభజన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తెలంగాణ ఏర్పడితే.. ఎవరు సీఎం అవుతారనే చర్చ అధికార కాంగ్రెస్‌లో తారాస్థాయికి చేరుకుంది. ఇదే క్రమంలో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు  ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కల్వకుర్తి నియోజకవర్గం  మాడ్గులకు చెందిన ఈయన.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ సీటు నుంచి ఎన్నికై ప్రస్తుతం కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే  అవకాశాలు ఉండటంతో కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి  ముఖ్యమంత్రిగా తనకే అవకాశం వస్తుందని ఆయన తన అనుచరుల వద్ద చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మొదట్లో సొంత నియోజకవర్గమైన కల్వకుర్తి నుంచి పోటీ చేయాలనే జైపాల్‌ భావించారు. ఆ మేరకు నియోజకవర్గంలోని టీడీపీతో పాటు ఇతర పార్టీ నేతలతో రహస్యంగా సమావేశమై మద్దతు ఇవ్వాలని కూడా కోరినట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే జయపాల్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి  ఆహ్వానించి జడ్చర్ల నియోజ కవర్గం నుంచి టిక్కెట్ ఇప్పిస్తానంటూ ఒక దశలో హామీ కూడా ఇచ్చారని చెబుతున్నారు. అయితే  చాలా కాలంగా సొంత ప్రాంతానికి దూరంగా ఉండడంతో..  అక్కడ పోటీ చేస్తే గెలుస్తారో లేదోననే జైపాల్‌రెడ్డి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మరో ఆప్షన్‌గా మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇక మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వారి మద్దతు ఉంటే విజయం తేలికవుతుందని భావించి ఇటీవల ముస్లింలతో జైపాల్‌రెడ్డి ప్రత్యేకంగా  సమావేశమై తన మనసులోని మాటను సూచన ప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కళ్లెం వేసి… కాంగ్రెస్ విజయం సాధించాలంటే మైనారిటీలు సహకరించాలని  కోరినట్లు తెలిసింది. మరోవైపు ఈ నియోజకవర్గంపై ఇప్పటికే కన్నేసిన ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బబేదుల్లా కొత్వాల్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్‌ టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

అయితే మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మొగ్గు చూపితే… హైకమాండ్‌ కూడా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వొచ్చు. అయినప్పటికీ స్థానిక నేతల నుంచి ఎలాంటి  వ్యతిరేకత రాకుండా.. జైపాల్‌ ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అటు ముస్లింలతో సమావేశమై వారి నుంచి కూడా హామీ తీసుకున్నట్లు కాంగ్రెస్‌ నేతలు  చెబుతున్నారు. మరి.. జైపాల్‌ పోటీకి జిల్లా నేతలు ఎంత వరకు సహకరిస్తారు..? ఆయన గెలుపు ఈజీయేనా అన్నది తేలాలంటే మరికొద్ది నెలలు ఆగాల్సిందే.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s