వణికించే చలిలోను కాంగ్రెస్‌కు చెమటలు

  • ప్రభుత్వంపై సొంత ఎంపీల తిరుగుబాటు
  • లాబీయింగ్ ముమ్మరం చేసిన ఆరుగురు
  • అవిశ్వాసానికి పెరుగుతున్న మద్దతు!
  • రాష్ట్ర విభజనలో మరో కీలకఘట్టం

పార్లమెంట్‌లో నెంబర్‌ గేమ్‌ మొదలైంది. అధికార పార్టీ ఎంపీలే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం.. దానిపై చర్చకు.. ఓటింగ్‌ జరిగేలా లాబీయింగ్‌ చేయడం కాంగ్రెస్‌ వ్యూహకర్తలను కంగారు పెడుతోంది. ఓటింగ్‌కు సరిపడా మద్దతు దొరికిందని ఢిల్లీలో ప్రచారం  జరుగుతోంది.

ఎముకలు కొరికే చలి, నరాలు తెగే ఉత్కంఠ.. దేశ రాజధాని హస్తినలో కొనసాగుతున్న అవిశ్వాసం హైడ్రామా. సొంత పార్టీ ఎంపీలే తమ ప్రభుత్వంపై అవిశ్వాసమనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంతో ఆగ్రహం కట్టులు తెంచుకుంటున్నా, పరువుకోసం సీమాంధ్ర ఎంపీలను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.

number-game-bigggggggg
రాష్ట్ర విభజన నిర్ణయంపై సీమాంధ్రలో ప్రజాగ్రహం పెల్లుబకడంతో.. ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఆరుగురు వెనకడుకు వేసే ప్రసక్తి లేదంటూ భీష్మించుకున్నారు. టి-బిల్లును అడ్డుకోవడమే టార్గెట్‌గా లాబీయింగ్‌ చేస్తున్నారు. దీంతో అవిశ్వాసంపై చర్చ జరుగుతుందా? లేదా? ఈ గండం నుంచి ప్రభుత్వం గట్టెక్కుతుందా? కుప్పకూలుతుందా? అనే ఉత్కంఠ అంతకంతకా పెరుగుతోంది.

మరోవైపు యూపీఏ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపీలే పెట్టిన అవిశ్వాసం.. తీర్మానం వరకు వెళుతుందా!? నోటీసు దశలోనే వీగుతుందా!? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఆరుగురు కాంగ్రెస్, నలుగురు టీడీపీ, ముగ్గురు వైసీపీ ఎంపీలు.. మొత్తం కలిసి 13 మంది వేర్వేరుగానే అయినా అవిశ్వాసానికి  నోటీసులిచ్చారు. కాని ఆ తీర్మానంపై స్పీకర్ సభ అనుమతి కోరినప్పుడు మరో 42 మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. అప్పుడే అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరుగుతాయి. లేకపోతే, నోటీసుదశలోనే వీగిపోతుంది. దీంతో ఇతర పార్టీల మద్దతు కోసం సీమాంధ్ర ఎంపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 14 మంది సభ్యులున్న బిజూజనతాదళ్ సపోర్ట్‌ని పొందారు. అన్నాడీఎంకే, అకాలిదళ్, శివసేన మద్దతు కూడా లభించిందన్న ప్రచారం సాగుతోంది.

దీంతో అవిశ్వాసానికి మద్దతిచ్చే వారి సంఖ్య 52 చేరిందని, ఇంకో ముగ్గురు ఎంపీలు సయ్యంటే.. లోక్‌ సభలో అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ జరగడం ఖాయమని ప్రచారంతో హస్తిన వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై టి-కాంగ్ ఎంపీలు ఒకింత ఆగ్రహానికి గురవుతున్నా.. అంతిమ విజయం తమదేనంటున్నారు. తెలంగాణని అడ్డుకునేందుకు ఎంత యాగీ చేస్తే.. అంత మంచి జరుగుతుందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఢిల్లీలో అన్నారు.

మరోవైపు.. సొంత పార్టీ ఎంపీలను నయానో, భయానో బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం నిమగ్నమైంది. రాష్ట్ర విభజన తరుణంలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం బాధాకరమన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలతో మాట్లాడనున్నట్లు దిగ్విజయ్ చెప్పారు. తాజా పరిణామాలపై స్పందించిన షిండే మాత్రం విభజన ప్రక్రియ రాజ్యాంగం ప్రకారమే సాగుతోందన్నారు.

అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ మీరాకుమార్ సభలో ప్రకటన చేశారని, ఎవరిపనివారు నిర్వర్తిస్తారని షిండే చెప్పుకొచ్చారు. నోటీసిచ్చిన వారంతా క్రమశిక్షణగల నేతలని, లక్ష్మణరేఖ దాటినట్లు తెలిస్తే చర్యలు తప్పవని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.సొంత ఎంపీలే తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీస్‌ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ నెత్తిన మరో పిడుగు పడింది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌పై బీజేపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. దీంతో యూపీఎ సర్కారుకు గజగజ వణికించే చలిలోను ముచ్చెమటలు పడుతున్నాయి.

Advertisements
Image | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s