అడ్డంకులు తొలగించేలా కోదండ ప్లాన్‌

  • రాష్ట్రంలో ఉద్విగ్న వాతావరణం
  • టీ-ముసాయిదా బిల్లుపై ఉత్కంఠ
  • తెలంగాణ,సమైక్యవాదుల  అలర్ట్

విభజన కురుక్షేత్రంలో తుది ఘట్టం. విభజనను అడ్డుకోవాలని ఒకరు… అడ్డంకులను తిప్పికొట్టాలని మరొకరు. అటు ఏపీఎన్జీవోలు, ఇటు టీజేఏసీ ఎవరికి వారు తమ లక్ష్యసాధన కోసం రంగంలోకి దూకుతున్నారు.
రాష్ట్రంలో ఉధ్విగ్న వాతావరణం. తెలంగాణ ముసాయిదా బిల్లు ఢిల్లీనుంచి అసెంబ్లీ చేరుతుండడంతో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో ఏదో తెలియని టెన్షన్‌. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమిస్తున్న ఎపీఎన్జీవోలు, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటంలో కీలక భూమికి పోషిస్తున్న టీ-జేఏసీ నాయకులు అప్రమత్తమయ్యారు.

Be-alert-biggggggg
విభజన నేపధ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిమాణాలను అధిగమించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్ హైదరాబాద్ వస్తున్నారు. రెండ్రోజులు ఇక్కడే మకాం వేస్తానని డిగ్గీరాజా స్వయంగా చెప్పారు. దీంతో సమైక్యవాదుల్లో కలవరం తారస్థాయికి చేరింది. టి-బీల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకే ఆయన వస్తున్నారని భావిస్తున్నారు. డిగ్గీ రాకను నిరసిస్తూ సీమాంధ్రలో ఆందళనలు చేపట్టాలని ఏపీఎన్జీవో అధ్యక్షడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్న ప్రకట వచ్చేవరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు టీజేఏసీ అప్రమత్తమైంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లుపై చర్చ జరిగేలా చూడాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు రెడీ అవుతోంది. అందుకోసం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను కలుస్తామని కోదండరాం చెప్పారు. సీమాంధ్ర నాయకుల కుట్రలను తిప్పికొట్టి.. బిల్లు ఆమోదం పొందే వరకు టి-ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు రాష్ట్రపతి కార్యాలయం గడప దాటడంతో.. రాష్ట్రంలో టెన్షన్‌ ప్రారంభమైంది. ఏపీఎన్జీవోలు, టీజేఏసీ నాయకులు  వ్యూహ, ప్రతివ్యూహ రచనలో నిమగ్నమయ్యారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s