వర్షంతో రద్దైన చివరి వన్డే మ్యాచ్‌

భారత్‌ పిచ్‌లపైనే పులులు.. బయట పిల్లులనే మాటను టీమిండియా మరోసారి నిలబెట్టుకుంది. స్వదేశీ పిచ్‌లపై ఎలాంటి ప్రత్యర్థినైనా బ్యాట్‌తో చీల్చి చెండాడే ధీరులు.. దక్షిణాఫ్రికాలో చెత్త బ్యాటింగ్‌కు ప్రతీకగా నిలిచారు. బౌలర్లేమీ తక్కువకాదు. మొత్తానికి ప్రత్యర్థుల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. వర్షంతో చివరి వన్డే రద్దవగా.. 2-0 తేడాతో సిరీస్‌ సౌతాఫ్రికా వశమైంది.

 

Match-biggg

తొలి రెండు వన్డేల్లో ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి బెదిరిన భారత బ్యాట్స్‌మెన్‌కు ఈసారి ఆ అవసరం రాలేదు. టెస్టు సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేద్దామనుకున్న టీమిండియాకు ఆ అదృష్టమూ దక్కలేదు. భారీ వర్షం కారణంగా మూడో వన్డే… ధోనిసేన బ్యాటింగ్‌కు దిగకుండానే రద్దయింది. ప్రత్యర్థి ఇన్నింగ్స్ ఆసాంతం దరికిరాని వాన, మనకు మాత్రం అడ్డుగా నిలిచింది. సెంచరీల హోరుతో పరుగుల వర్షం కురిపించిన దక్షిణాఫ్రికా మరోసారి మన బౌలర్ల బలహీనతను బయట పెట్టింది.

సిరీస్‌లో ఒక్క వన్డే అయినా నెగ్గి పరువు నిలబెట్టుకుందామనుకున్న భారత్ ఆశలు తీరలేదు. మూడో వన్డేలో దక్షిణాఫ్రికా పూర్తి ఇన్నింగ్స్‌ను 50 ఓవర్ల పాటు ఆడగా…భారత్‌కు మాత్రం ఆ ఛాన్స్ దక్కలేదు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిపోయింది. తొలి రెండు వన్డేలు నెగ్గిన దక్షిణాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది.  మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. క్వాంటన్ డి కాక్ వరుసగా మూడో సెంచరీ సాధించగా, కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కూడా శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లు ఆరంభంలో అదరగొట్టినా తర్వాత విఫలమవడంతో సఫారీ టీమ్ మంచి స్కోర్ సాధించగలిగింది.

సిరీస్ కు ముందు చరిత్రను తిరగరాస్తామంటూ చెప్పిన టీమిండియా..ఆ దిశగా పోరాటం చేయకపోవడం అభిమానులను నిరాశ పర్చింది. ఇక్కడ ఓడినందుకు అభిమానులు బాధపడడం లేదు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌తో కూడిన జట్టు ఇలా కనీస పోరాటం కూడా ఇవ్వకుండా తలవంచడమే వారిని బాధిస్తోంది.

Advertisements
Image | This entry was posted in Sports and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s