ఆగమేఘాలపై వచ్చిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

 • రెడ్‌సిగ్నల్ పడకుండా ఢిల్లీ పెద్దల ప్రణాళిక
 • విభజనపై ఢిల్లీలో పక్కా ప్రణాళిక
 • ఆలస్యం లేకుండా అసెంబ్లీకి డ్రాఫ్ట్‌
 • రాజ్యాంగ ప్రతినిధులకు అందజేత
 • అంతా కాంగ్రెస్‌ వర్కింగే!
 • ఉత్కంఠ రేపిన ట్విస్టులు
 • అటు.. డ్రాఫ్ట్‌ డ్రాయింగ్‌లో
 • ఇటు.. డ్రాఫ్ట్‌ పోస్టింగ్‌లో..
 • అంతా హస్తం వ్యూహమే
 • తేడా వస్తే.. డిగ్గీ ఉన్నారుగా!
 • ధిక్కారంపై ఢిల్లీ అప్రమత్తత

 

Sketch-biggggg
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఆగమేఘాలపై వచ్చేసింది. ఎక్కడా రెడ్‌సిగ్నల్‌ పడకుండా ఢిల్లీ నాయకత్వం జాగ్రత్త పడుతోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి తీరాల్సిందేనన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇవాళ అసెంబ్లీ సభ్యులకు అందనున్న ముసాయిదా బిల్లు, దిగ్విజయ్‌ సింగు ఇద్దరూ నిన్న ఒకేరోజు హైదారబాద్‌ రావడం పక్కా ప్లానింగ్‌లో భాగమేనని సమాచారం.

కాకలు తీరిన రాజకీయ నాయకులకు పెట్టింది పేరు.. కాంగ్రెస్‌. చిన్న సమస్యను పెద్దదిగా చేసి… పరిష్కారానికి ఆస్కారం లేకుండా చిక్కుముడిగా మార్చేయాలన్నా… పెద్ద ప్రాబ్లమ్‌ని చాకచక్యంగా హ్యాండిల్‌ చేయాలన్నా కాంగేయులకే సాధ్యమని అంటుంటారు. అది మరోసారి నిజమవుతోంది. రాష్ట్ర విభజనపై అధిష్టానం పక్కా ప్లానింగ్‌తోనే అడుగులు వేస్తోంది. సీడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా.. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా ముందుకెళ్తోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎవరేమి అనుకున్నా.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది. అంతా రాజ్యాంగబద్ధంగానే జరిగేలా చూస్తూ.. హైకమాండ్‌ పెద్దలు చాణక్యం ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపే వరకు… ఢిల్లీలో జరిగిన పరిణామాలను ఓసారి పరిశీలిస్తే… ఈ విషయం అర్థమవుతుంది.

హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం. అందుకు యూపీఏ సమన్వయ కమిటీ ఓకే చెప్పింది. ఆ తర్వాత సీన్‌ కేంద్ర కేబినెట్‌ ఆమోదం. ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసినా.. జీవోఎంని నియమించినా.. అందరూ cwc తీర్మానం చుట్టూనే తిరిగారు. మధ్యమధ్యలో హైదరాబాద్‌ యూటీ అని, రాయల తెలంగాణ అంటూ.. ఆందోళనల్ని డైవర్ట్‌ చేసే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అంతెందుకు టి-ముసాయిదా బిల్లును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. అసెంబ్లీకి పంపడం కూడా ప్రణాళికలో భాగమేనని అంటున్నారు.

కేంద్ర కేబినెట్ ఆమోదించిన డ్రాఫ్ట్‌ రాష్ట్రపతికి చేరాక.. కొన్ని గంటల్లోనే రాష్ట్రానికి పంపుతారని అనుకున్నారు. కానీ.. అలా జరగలేదు. నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలాకు నివాళి అర్పించేందుకు ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని టీమ్‌ దక్షిణాఫ్రికా టూర్‌కి వెళ్లింది. దీంతో.. ప్రక్రియ ఆలస్యం అవుతుందని .. ఈలోపు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగుస్తాయని కొందరు.. ఏకంగా ఎన్నికలే వస్తాయని మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. కానీ.. ప్రణబ్‌ ఢిల్లీ రాగానే.. ముందుగా అనుకున్న సమయానికే ముసాయిదాను రాష్ట్రానికి పంపారు. సరిగ్గా అదే రోజున దిగ్విజయ్‌ సింగ్‌ హైదరాబాద్‌లో మకాం వేయడం యాధృచ్ఛికం కాదని.. అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోందనడానికి నిదర్శనమనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇంకో విషయం ప్రధానంగా చెప్పుకోవాలి. టి-ముసాయిదాకు ఎక్కడా ఎర్రజెండా ఎదురుకాకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రత్యేక విమానంలో.. హోంశాఖ సంయుక్త కార్యదర్శితో రాష్ట్రానికి పంపడం ఒక ఎత్తైతే…. ఆయన నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించి తన పనైపోయిందని వెళ్లిపోకుండా.. ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి స్వయంగా అందజేశారు. అంటే.. ఎక్కడా ఏ చిన్న ఆలస్యం కూడా జరిగేందుకు వీల్లేకుండా ఢిల్లీ పెద్దలు స్కెచ్‌ వేశారు. ఇప్పటివరకు అంతా వాళ్లు అనుకున్నట్టే జరుగుతోంది. డిగ్గీరాజా ప్రత్యేక మంతనాలతో ఇకముందు కూడా ప్లానింగ్ ప్రకారమే విభజన జరిగిపోయేలా అధినాయకత్వం వ్యూహరచన చేసింది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s