37వ రోజుకు చేరిన సువర్ణభూమి అయ్యప్పల 23వ మహాపాదయాత్ర

  • కేరళలోని తోటలు, అడవుల మధ్య నుంచి కొనసాగుతున్న యాత్ర
  • నేటితో 1134 కిలోమీటర్లు పూర్తికానున్న పాదయాత్ర
  • రేపు అయ్యప్ప సన్నిధానం చేరనున్న స్వాములు
  • సువర్ణభూమి చేపట్టిన అయ్యప్ప స్వాముల 23వ మహాపాదయాత్ర

 

 

suvarnabjoomi-bigggggg
స్వాములకు కొత్త అనుభూతినిస్తోంది. కేరళ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ యాత్రలో స్వాములు సుగంధ ద్రవ్యాల తోటల మధ్య నుంచి…. క్రూరమ్రుగాలు సంచరించే అడవుల మధ్య నుంచి నడక సాగిస్తున్నారు. రేపు మణికంఠుడి సన్నిధానానికి చేరుకోబోతున్న అయ్యప్ప భక్తులు….
ఇవాళ 37వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

సువర్ణభూమి అయ్యప్పల 23వ మహాపాదయాత్ర కేరళ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఒకవైపు సుగంధ ద్రవ్యాల తోటల ఆహ్లాదకర వాతావరణం ఆకట్టుకుంటుంటే… మరోవైపు క్రూరమైన జంతువులు తిరిగే అడవి ప్రాంతం గుండా ఈ పాదయాత్ర చేపట్టారు స్వాములు.  రాత్రి వెండిపెరియార్ లో విడిది చేసిన స్వాములు…. ఇవాళ వేకువజామునే అయ్యప్పకు పూజలు చేసి పాదయాత్ర మొదలు పెట్టారు. రేపు హరిహరసుతుని సన్నిధానానికి చేరనుండడంతో… స్వాములు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. మధ్యాహ్నానికి పులిమేడ చేరి అక్కడే భిక్ష చేస్తారు. ఇవాళ పులిమేడలోనే విశ్రాంతి తీసుకుంటారు.

పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప భక్తులను… మార్గమధ్యంలో పలువురు స్వాములు కలుసుకుంటున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు కూడా… హైదరాబాద్ స్వాములతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఈ స్వాములు పడి బండిని అంటే అయ్యప్ప 18 మెట్లతో కూడిన బండిని తోసుకుంటూ నడకసాగించడం విశేషం.

పాదయాత్ర చేస్తున్న స్వాములకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టరును, తాగునీటిని సరఫరా చేసి దాహం తీరుస్తున్న దాతను సత్కరించారు. గురుస్వాములను కూడా శాలువాలతో సన్మానించారు మిగతా అయ్యప్ప భక్తులు. ఈ సందర్భంగా తొలిసారి పాదయాత్ర ప్రారంభించిన వేణుగోపాల గురుస్వామి సేవలను కొనియాడారు. అయ్యప్పను శరణువేడుతూ శబరిదిశగా వేగంగా ముందుకు సాగుతున్న స్వాములు…. ఇవాళ 30 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. దీంతో యాత్ర 1134 కిలోమీటర్లు పూర్తవుతుంది.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s