11 అంశాలపై ఓటింగ్‌కి CM సన్నాహాలు..

అసెంబ్లీలో విభజన ముసాయిదా బిల్లుపై చర్చ మాత్రమే జరుగుతుందా..? ఓటింగ్ ఉంటుందా..?.ఒక వేళ ఓటింగ్ జరిగితే పరిస్థితి ఏమిటి.?   బిల్లుకు వ్యతిరేకంగా మెజార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారా..? ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీలో విభజన ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారా…? బిల్లుపై   ఓటింగ్‌ కూడా జరుపుతారా..? అనేదే ఇప్పుడు  సస్పెన్స్‌గా మారింది. ముసాయిదా బిల్లులోని కీలకమైన 11 అంశాలపై అసెంబ్లీ అభిప్రాయం చెప్పాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ స్పష్టం చేశారు.

evari-goal-varidi-biggggg

 

ఇప్పుడు సీఎం కిరణ్ కూడా 11 అంశాలపై విసృత్తంగా చర్చ జరపాలని భావిస్తున్నారు. ఒక్కో అంశంపై  చర్చతో పాటు ఓటింగ్‌ కూడా జరిపాలనే  ప్రతిపాదనపై కూడా సీరియస్‌గా చర్చిస్తున్నారు. అయితే అసెంబ్లీలో ఎలాంటి ఓటింగ్ అవసరం లేదని కేవలం అభిప్రాయం మాత్రమే చెబితే  సరిపోతుందనే తెలంగాణవాదులు అంటున్నారు..

అసెంబ్లీలో ఒక వేళ ఓటింగ్ జరిపితే.. అది తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటుందని తెలంగాణవాదులు భావిస్తున్నారు.. అసెంబ్లీలో సమైక్యానికి  అనుకూలంగా  ఓటింగ్ జరిగితే… విభజన ప్రక్రియలో కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చని అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావిస్తోంది. అందుకే  ముసాయిదా బిల్లుపై ఓటింగ్ జరిగినా గట్టెక్కేలా కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో  తెలంగాణకు 119 మంది  ఎమ్మెల్యేలు ఉన్నారు.
అటు సీమాంధ్రకు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి 15 మందిపై అనర్హత వేటుతో ప్రస్తుత  సీమాంధ్ర ఎమ్మెల్యేల బలం  160… అంటే మొత్తం ఎమ్మెల్యేలు 279 మంది.. విభజన ముసాయిదా బిల్లు అసెంబ్లీలో నెగ్గాలంటే  140 మంది సభ్యులు అవసరం.. ఇప్పటికే  తెలంగాణకు చెందిన 119 మంది సభ్యులు ముసాయిదా బిల్లుకు అనుకూలంగా ఓటేస్తారని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇక 20 నుంచి 25 మంది  సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరిగినా గట్టెక్కించవచ్చు.

దిగ్విజయ్ సింగ్ తన  రెండు రోజుల పర్యటనలో దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది.కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులైన వారితో చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే పాతిక మంది సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడిన దిగ్విజయ్ వారి రాజకీయభవిష్యత్‌ భరోసా ఇచ్చారనే గాంధీభవన్  వర్గాలంటున్నాయి..

అయితే దిగ్విజయ్‌ నడిపిన మంత్రాంగం తెలుసుకున్న సీఎం కిరణ్.. ఇప్పుడు దానికి కౌంటర్‌ ప్లాన్ రెడీ చేశారు.  రాష్ట్రపతి ప్రతి అంశంపై  స్పష్టమైన  అభిప్రాయం చెప్పాలని కోరారు కాబట్టి.. ముసాయిదా బిల్లులోని ప్రతి అంశంపై చర్చతో పాటు ఓటింగ్ కూడా జరిపే యోచనలో ఉన్నారు.

ఇలా  ఒక్కో అంశంపై  కనీసం రెండు రోజులు చర్చ జరిపి.. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించడం వల్ల.. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు  విభజనకు  అనుకూలంగా ఓటేస్తారనేది తొలి దశలోనే  తెలుసుకోవచ్చనేది కిరణ్ ప్లాన్.. ఇలా సీమాంధ్ర  కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో  ఎవరైనా  దిగ్విజయ్  మంత్రాంగంతో తెలంగాణకు జై కొడితే.. అలాంటి వారిపై సీమాంధ్రలో వ్యతిరేకత వెల్లువెత్తేలా కిరణ్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు.  మరి కిరణ్ ప్లాన్ ఎంతవరకు వర్క్‌ అవుట్ అవుతుంది..? దిగ్విజయ్ మంత్రాంగం ఎంతవరకు ఫలిస్తుందనేది మరి కొద్ది రోజుల్లోనే తేలబోతోంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s