టి-బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతల యత్నాలు

రాష్ట్ర విభజనను అడ్డుకుంటామన్న ధీమా ఇంకా సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది. ఆఖరి ఘట్టం మొదలైనా వారిలో ఆత్మవిశ్వాసం మాత్రం తొణికిసలాడుతోంది. 371-డి, ఆర్టికల్ త్రీ లాంటి అంశాలే తమకు అస్త్రాలని నేతలు చెబుతున్నారు. మరోవైపు తమలో వెనుకడుగేసే నాయకులెవరైనా ఉంటే అడ్డుకోవడం కష్టమేనన్న భయమూ వారిని వెన్నాడుతోంది.

తెలంగాణ బిల్లును అడ్డుకొనేందుకు సీమాంధ్ర నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ మొదలైందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చెబుతుంటే… బిల్లు కేవలం అసెంబ్లీకి వచ్చిందని సీమాంధ్ర నేతలంటున్నారు. సభా నాయకుడు సీఎం లేకుండా చర్చ ఎలా మొదలవుతుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బిల్లును ఏ విధంగా అడ్డుకోవాలన్నదానిపై భారీ కసరత్తే చేస్తున్నారు సీమాంధ్ర నేతలు. రాష్ట్రపతి ఇచ్చిన 42 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మరికొన్ని రోజులు సమయం కోరాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సాధ్యాసధ్యాలపై చర్చిస్తున్నారు.

ఎట్నుంచి ఎటు చూసినా ఆర్టికల్‌ 371-డి, ఆర్టికల్ త్రీలపైనే సీమాంధ్ర నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇవే చివరి అస్త్రాలుగా ఉపయోగించాలని చూస్తున్నారు. మరోవైపు బిల్లులోని ప్రతీ అంశంపై ఓటింగ్‌ కోరడం ద్వారా… అన్ని ప్రతిపాదనలు ఓడించి పంపవచ్చన్న ప్లానూ ఉంది. అయితే కేవలం అభిప్రాయం మాత్రమేనని చెబుతున్న కేంద్రం.. ఓటింగ్‌కు అంగీకరిస్తుందా.. లేదా అనేది తేలాల్సి ఉంది. సీఎంకు హోంశాఖ రాసిన లేఖలో అభిప్రాయమనే ఉన్నట్లు సమాచారం. అయితే ఓటింగ్‌ లేకుండా అభిప్రాయమేంటన్న సందేహం సీఎం వర్గం లేవనెత్తుతోంది.

సీమాంద్ర కాంగ్రెస్‌ నాయకులు చివరి వరకు విభజనకు వ్యతిరేకంగా పోరాడతామని ఆ ప్రాంత నేతలు చెబుతున్నారు. అడ్డుంటామన్న ధీమా ఓ పక్క ఉన్నా తమలోనే కొంత మంది విభజనకు అనుకూలంగా పనిచేస్తారన్న భయమూ వారిని వెన్నాడుతోంది. సీమాంధ్ర నేతల్లో ఎవరూ గోతులు తియ్యకపోతే విభజన ఆపడం తధ్యమని టీజీ వెంకటేస్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం మీద విభజనను ఏవిధంగానైనా అడ్డుకోవాలని చూస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు ఆఖరి అస్త్రాలకు పదును పెడ్తున్నారు. అదే సమయంలో నాలుక మడతపెట్టే నాయకులపైనా కన్నేస్తున్నారు. వారెవరో తెలుసుకొనే ప్రయత్నమూ చేస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s