అసెంబ్లీలో వ్యూహాలపై సీఎం శిక్షణా తరగతులు

  • డ్రాఫ్టులోని తప్పులే బ్రహ్మాస్త్రాలు: కొలిగ్స్‌తో సీఎం
  • ఒక్కొక్కరు 2 గంటలు స్పీచ్ ఇవ్వాలి: సీఎం కర్తవ్య బోధ
  • చివరగా విభజనకు వ్యతిరేకమన్న లేఖాస్త్రం సమర్పణ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీఎం ఫైనల్ మ్యాచ్‌ సమయం రానే వచ్చింది. ఫిట్‌నెస్ సరిగా లేకపోయినా.. మ్యాచ్‌లో ప్రభావం కచ్చితంగా చూపుతారని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. డ్రాఫ్టు బిల్లును క్షుణ్నంగా అధ్యయనం చేసి సభకు రావాలని… ఒక్కొక్కరు రెండు గంటలకు తగ్గకుండా మాట్లాడేలా ప్రిపేర్ అవ్వాలని సమైక్య బోధ చేశారు. అంతా అయ్యాక… స్పీకర్‌కు విభజన తిరస్కార లేఖను ఇస్తే సరిపోతుందని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఇంతకీ సీఎం ఫైనల్ వ్యూహం ఫలిస్తుందా?

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం క్యాంప్ కార్యాలయంలో వ్యూహాలు పదునెక్కాయి. టీ బిల్లు శాసనసభలో పెట్టిన సమయంలో అనారోగ్యంతో.. సభకు దూరంగా ఉండడంపై చెలరేగిన దుమారాన్ని తనదైన రీతిలో చల్లార్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి… సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఏం చేస్తే.. విభజన ఆగిపోతుందో ఆ ఫార్ములాను అందరికీ వినిపించారు కిరణ్. నిన్న రాత్రి జరిగిన సమావేశానికి 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

తెలంగాణ ముసాయిదా బిల్లుపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సీఎం కిరణ్ సహచరులకు సూచించినట్లు తెలిసింది. బిల్లులో లోటుపాట్లను పరిశీలించాలని.. వాటినే బ్రహ్మాస్త్రాలుగా మలచుకోవాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. బిల్లులో చాలా తప్పులు ఉన్నాయని.. వాటిని సమర్థంగా తిప్పికొడితే విభజనకు బ్రేక్ వేయొచ్చని వ్యూహ రచన చేస్తున్నారు. చర్చ జరిగినన్ని రోజులూ… సభ్యులెవరూ గైర్హాజరు కావొద్దని సీఎం సూచించినట్లు తెలిసింది. సభలో ఒక్కొక్కరు రెండు గంటలకు తక్కువ కాకుండా మాట్లాడేలా బిల్లుపై ప్రిపేర్ అవ్వాలని కర్తవ్యబోధ చేశారు.

ప్రతి సభ్యుడూ లిఖితపూర్వకంగా.. విభజనను వ్యతిరేకిస్తున్నట్లు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు లేఖ సమర్పించాలని నిర్ణయించారు. అదే లేఖను రాష్ట్రపతికి, అవసరమైతే అత్యున్నత న్యాయస్థానానికీ అందేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.

స్పీకర్ పోడియం దగ్గర విపక్షాలు చేసే నిరసనలకు దూరంగా ఉండాలని… కేవలం చర్చపైనే దృష్టి సారించాలని సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు తీర్మానించుకున్నట్లు తెలిసింది. సభలో ఎప్పటికప్పుడు వైసీపీ, టీడీపీ చేసే చర్యలకు భిన్నంగా సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించాలని డిసైడ్‌ అయ్యారు. మరి… చర్చ సమయంలో అసెంబ్లీలో కిరన్‌ ఫార్ములాను ఎలా అమలు చేస్తారో చూడాల్సిందే.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s