టీ-బిల్లుపై చర్చకు కౌంట్ డౌన్

  • సమగ్ర చర్చకు సిద్దమైన అసెంబ్లీ
  • వ్యూహ, ప్రతివ్యూహాల్లో పార్టీలు
  • ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేల ఎత్తులు
  • పోటాపోటీ వ్యూహాలతో పొలిటికల్ హీట్     

టీ-బిల్లుపై చర్చకు కౌంట్ డౌన్ ఆరంభమైంది. కాసేపట్లో విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభం కానుంది. అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో చర్చకు సిద్దమయ్యాయి. పార్టీ జెండాలు పక్కనపెట్టి ప్రాంతీయ వాదనలు వినిపించటానికి ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు చర్చ సజావుగా సాగడానికి వ్యూహ రచన చేస్తుండగా, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అడ్డుకునేందుకు రెడీ అవుతున్నారు. దీంతో అసెంబ్లీ విభజన సెగలతో దద్దరిల్లే అవకాశముంది.

రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై చర్చకు అసెంబ్లీ సిద్దమైంది. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇవాళ్టీ నుంచి శుక్రవారం వరకు టీ-బిల్లుపై సభలో చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేసి పూర్తిగా ముసాయిదా బిల్లుపైనే చర్చించనున్నారు. ప్రభుత్వం తరపున చీఫ్ విప్ గండ్ర వెంకటరమాణారెడ్డి చర్చను ప్రారంభిస్తారు. అనంతరం స్పీకర్ ఇచ్చిన గడువు మేరకు సభ్యులకు మాట్లాడే అవకాశం లభించనుంది. అవసరమైతే సమావేశాలను పొడిగించడానికి సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది.

టీ-బిల్లుపై చర్చకు లైన్ క్లియర్ కావడంతో పార్టీలకతీతంగా ప్రాంతాలవారీగా ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారు. ముసాయిదా బిల్లుపై తమ వాదన వినిపించటానికిబిల్లులో పొందుపరిచిన క్లాజులపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా విడిపోయారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సీఎం కిరణ్ సూచనలకు అనుగుణంగా సభలో వ్యవహిరించాలని నిర్ణయించుకున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంతో పాటు సీనీయర్ మంత్రుల పర్యవేక్షణలో చర్చకు సిద్దమవుతున్నారు.

టీడీపీలోనూ ఎమ్మెల్యేలు ప్రాంతాలవారీగా విడిపోయారు. బీఏసీ సమావేశంలో సమైక్య తీర్మానం కోసం గాలి ముద్దుకృష్ణమ నాయుడు పట్టుబట్టగా సత్వర చర్చకు మోత్కుపల్లి డిమాండ్ చేశారు. టీ-బిల్లుపై సభలో జరిగే చర్చలోనూ టీడీపీ ఎమ్మెల్యేలు రెండు వాదనలు వినిపించనున్నారు. అయితే పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ కల్గిస్తుంది. సమైక్య వాదిగా బిల్డప్‌ ఇచ్చిన సీఎం కిరణ్‌ చర్చకు లైన్‌ క్లియర్‌ చేశారని TDP ఆరోపిస్తోంది.

ఇక సమైక్యసమరంలో దూకుడుగా ఉన్న వైసీపీ సభలో సమైక్య తీర్మానానికి పట్టుబట్టనుంది. సమైక్య తీర్మానం చేసేంత వరకు తెలంగాణ బిల్లుపై చర్చను అడ్డుకుంటామని వైసీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. అసెంబ్లీలో తీర్మానం చేయకుండానే ముసాయిదాపై ఎలా చర్చిస్తామని ఆపార్టీ ఫ్లోర్ లీడర్ విజయమ్మ ప్రశ్నించారు. సమైక్య తీర్మానం చేసిన తర్వాతే..టి.బిల్లుపై చర్చ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో టీ-బిల్లుపై చర్చను ప్రారంభింపచేయడంలో సక్సెస్ అయిన టీఆర్ఎస్  అదే ఊపుతో  ముందుకు వెళ్లడానికి సిద్దమవుతోంది. అసెంబ్లీలో తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలందరినీ సమన్వయం చేసుకుంటూ అంతా సవ్యంగా జరిగేలా ప్లాన్‌ చేస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో సమగ్రమైన చర్చ జరిగేలా  అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని ఈటెల విజ్ఞప్తిచేశారు.

అటు ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా సభ్యులు తమ స్టాండ్ ను సమగ్రంగా వివరించటానికి ప్రిపేరవుతున్నారు. బిల్లులో పొందుపరిచిన అంశాలపై తమ అభిప్రాయాలను, అనుమానాలను లేవనెత్తనున్నారు. అయితే అసెంబ్లీలో రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో చర్చ ఎలా సాగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీతో పాటు సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు సభను అడ్డుకుంటామని ప్రకటించడంతో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగే సూచనలే  కన్పిస్తున్నాయి.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s