లోక్‌పాల్‌ బిల్లులో లోపాలున్నాయన్న కేజ్రీవాల్‌

రాజ్యసభలో ఆమోదించిన లోక్‌పాల్‌కు నిజంగానే కోరలు లేవా? బుసలు కొట్టడం వరకే పరిమితమా? అంటే అవుననే అంటున్నారు ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు. దాన్నో జోక్‌పాల్‌గా అభివర్ణించుకుంటున్నారు. కేవలం 40 శాతం అవినీతిని పారదోలే.. బిల్లుకు అన్నా హజారే ఎందుకు సంతృప్తి చెందారో అర్థం కావడం లేదంటున్నారు. ఇంతకీ రాజ్యసభలో ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుకు చిల్లులున్నాయా? ఆమ్‌ఆద్మీ నాయకులు తాజా బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

సర్కారీ లోక్‌పాల్‌ను ప్రధాని, విపక్ష నేత, స్పీకర్, సుప్రీంకోర్టున్యాయమూర్తి, జ్యూరీ సభ్యుడు మొత్తం ఐదుగురు మెజార్టీ అభిప్రాయంతో కలిపి నియమిస్తారు.
జనలోక్‌పాల్‌లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు, ఇద్దరు హైకోర్డు జడ్జిలు, కాగ్, సీవీసీ, సీఈసీ తరపున ఒకరు, ప్రధాని, విపక్ష నేత మొత్తం ఏడుగురు సభ్యుల బృందం.. లోక్‌పాల్‌ను నియమిస్తుంది.
 లోక్‌పాల్‌ను తొలగించాలంటే.. వందమంది ఎంపీలు… సుప్రీంకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది.
 లోక్‌పాల్‌ బృందంలో ఎవరిని తొలగించాలన్నా… పౌరులకు సర్వహక్కులుంటాయి. ఆధారాలతో సుప్రీంకు వెళ్తే వారి పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుంటారు.


 సీబీఐకి సంబంధించి… పాలనాపరమైన నిర్వహణ బాధ్యతలు ప్రత్యక్షంగా కేంద్ర పరిధిలోనే ఉండడం… పెద్ద మైనస్‌గా భావిస్తోంది ఆమ్‌ఆద్మీ పార్టీ. కేసు దర్యాప్తులో ఉండగా.. విచారణాధికారి బదిలీలు…, పోస్టింగులు తదితర అంశాలన్నీ కేంద్రం చేతిలోనే ఉండడం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
 జనలోక్‌పాల్‌లో ప్రతిపాదించిన ప్రకారం.. సీబీఐ పాలనాధికారాలన్నీ లోక్‌పాల్ పరిధిలోకి వెళ్తాయి. దీంతో ప్రభుత్వం నుంచి పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా సీబీఐ ఉంటుందని భావించారు.
 తాజా బిల్లులో అవినీతి పరుల విషయం బయటపెట్టే వ్యక్తుల రక్షణ అంశం ఎక్కడా పొందుపరచలేదు.
 జనలోక్‌పాల్‌లో అవినీతి పరుల భరతం పట్టే వ్యక్తులకు పూర్తి రక్షణ కల్పిస్తుంది.
 సర్కారీ లోక్‌పాల్‌ పరిధి నుంచి న్యాయవ్యవస్థను పూర్తిగా తొలగించారు.
 ప్రభుత్వోద్యోగులు, జడ్జిలు, ఎంపీలు అందరూ జనలోక్‌పాల్‌ పరిధిలోకి వచ్చేలా ప్రతిపాదించారు.
 సర్కారీ లోక్‌పాల్‌ బిల్లు ప్రకారం… ఎవరైనా తప్పుడు ఫిర్యాదు చేసినట్లు రుజువైతే.. ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తారు. ఈ తరహా జైలుశిక్షలతో లోక్‌పాల్‌కు నిజమైన ఫిర్యాదుదారు కూడా దూరంగా ఉంటారని భావిస్తున్నారు. సాక్ష్యాలు తారుమారైతే ఫిర్యాదుదారు జైలుకు వెళ్లాల్సిందే.
 జనలోక్‌పాల్‌లో మాత్రం.. లక్ష రూపాయల జరిమానా విధించేలా ప్రతిపాదించారు. మొత్తంగా.. భారీ లోపాలున్న లోక్‌పాల్‌కు రాజ్యసభ ఆమోదం తెలిపిందని కేజ్రీవాల్ అభిప్రాయపడుతున్నారు. అవినీతిపై పోరాటం… జనలోక్‌పాల్‌ చట్టం కోసం జరిగిన పోరాటం నుంచి పుట్టుకొచ్చిన కేజ్రీవాల్‌… మున్ముందు ఎలా వ్యవహరిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
కొడితే దిమ్మతిరగాలి. మైండ్ బ్లాంక్ అవ్వాలి. అదీ జన్‌లోక్‌పాల్ బిల్లు స్టామినా. కానీ తాజా లోక్‌పాల్‌లో చాలా కీలకాంశాలు పక్కకు పోయాయన్న వాదన తెరపైకి వస్తోంది. సవరణల కోసం.. రెండేళ్లు వాయిదా పడి ఎగువ సభ ఆమోదం పొందిన ప్రస్తుత లోక్‌పాల్‌.. కేవలం 40 శాతం అవినీతిని మాత్రమే అరికట్ట గలుగుతుందని చెబుతున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ అయితే.. దాన్నో జోక్‌పాల్‌గా అభివర్ణించింది. ఇంతకీ లోక్‌పాల్‌లో లోటు ఏంటి??

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s