దేవయాని ఎపిసోడ్‌పై స్వరం పెంచిన భారత్‌

– అమెరికా వ్యవహారాన్ని ఖండించిన ఉభయ సభలు
– గౌరవం నిలబెట్టాకే సభలో అడుగుపెడతా: ఖుర్షీద్
– చేతులకు సంకెళ్లేసి డ్రగ్స్‌మాఫియా బ్యారక్‌లో విచారణ
– భారత ఆగ్రహంపై దిద్దుబాటు చర్యలకు దిగిన అమెరికా
– స్టేట్ డిపార్ట్‌మెంట్ పోలీసులు, న్యూయార్క్ మార్షల్స్ రగడ

అమెరికాలో భారత విదేశాంగ ప్రతినిధి దేవయానికి జరిగిన అవమానంపై యావద్భాతరంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అమెరికా వ్యవహారం ఏమాత్రం బాగోలేదంటూ.. లోక్‌సభ ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేసింది. దేవయానికి గౌరవం లభించాకే సభలో అడుగు పెడతానని విదేశాంగ మంత్రి ఖుర్షీద్ ప్రతీన బూనారు. అమెరికా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పలు చోట్ల జనం నిరసనలు వ్యక్తం చేయడం.. హీట్‌ను పెంచేశాయి. ఇదిలావుంటే… దేవయానిని ఐక్యరాజ్యసమితిలో భారత కార్యాలయానికి కేంద్రం బదిలీ చేయడంతో… దౌత్యవేత్తలకు ఉండే రక్షణ కల్పించినట్లైంది.

దేవయానికి అమెరికాలో జరిగిన అవమాన భారం… దేశంలో పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. అమెరికా వ్యవహారంపై ఉభయసభల్లో హాట్‌హాట్‌గా చర్చ సాగింది. దేవయాని పట్ల న్యూయార్క్ పోలీసులు అనుసరించిన తీరు ఏమాత్రం బాగోలేదంటూ.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భాతర విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్… ఒకడుగు ముందుకేసి.. దేవయాని గౌరవం నిలబెట్టిన తర్వాతే మళ్లీ లోక్‌సభలో అడుగు పెడతానని.. ప్రతిజ్ఞ చేశారు. దౌత్యాధికారిపై యూఎస్  పోలీసుల అనుసరించిన  తీరును ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం తీవ్రంగా ఖండించారు.. ఈ అంశంపై రాజ్యసభలో సభ్యులు పార్టీల కతీతంగా తమ నిరసన వ్యక్తం చేశారు.

చేతులకు సంకెళ్లేసి… రేపిస్టులు, కిడ్నాపర్లు, సెక్స్ వర్కర్లు, డ్రగ్స్ మాఫియా పక్కన నిల్చోబెట్టి దేవయానిని విచారించడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దేవయాని ఎపిసోడ్‌లో అమెరికా ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోయినా.. భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తం కావడంతో..  దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది.

తప్పు మీదంటే మీదని స్టేట్ డిపార్ట్‌మెంట్ పోలీసులు, న్యూయార్క్ మార్షల్స్ ఒకరిమీద మరొకరు నెపం మోపుకుంటున్నారు. ఇదిలావుంటే… దేవయానిని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత రాయబార కార్యాలయానికి బదిలీ చేసింది కేంద్రం. దీంతో ఆమెకు వియన్నా ఒప్పందం, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం.. దౌత్యవేత్తలకు ఉండే అన్ని రకాల భద్రత ఉండనుంది.

Advertisements
Video | This entry was posted in International and tagged , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s