జెండాలకు టాటా …పార్టీలకు బైబై

  • పార్టీలకతీతంగా నేతల ఉద్యమబాట
  • ప్రాంతీయవాదమే ఏకైక ఎజెండాగా యాక్షన్
  • పార్టీ అధినేతలను ధిక్కరిస్తున్న నేతలు
  • పోటాపోటీ వ్యూహాలతో పొలిటికల్ హీట్

పార్టీలను పక్కనపెట్టారు.. జెండాలకు టాటా చెప్పారు. పార్టీకలతీతంగా  ఉద్యమబాట పట్టారు. ప్రాంతీయవాదమే ఏకైక ఎజెండాగా  ప్రజాప్రతినిధులు కదం తొక్కుతున్నారు. పార్టీ అధినేతలను సైతం ధిక్కరిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. నాయకుల పోటాపోటీ వ్యూహాలతో విభజన రాజకీయాలు మరింత రక్తికడుతున్నాయి.

రాష్ట్ర విభజన అంశం పార్టీలను నిట్టనిలువునా చీల్చింది. పార్టీలకతీతంగా నేతలను కలుపుతోంది. ఎపుడూ పరస్పరం విమర్శించుకునే నాయకులు సైతం ప్రాంతీయవాదమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. అసెంబ్లీ వింటర్ సెషన్ లో జెండాలను పక్కనపెట్టిన నేతలు తెలంగాణ, సమైక్యవాదులుగా విడిపోయి ఉద్యమించారు. పార్టీ అధినేతలను పట్టించుకోకుండా ఎవరికివారు తమ వాదనలు గట్టిగా వినిపించారు.

విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధినేత్రి సోనియాపైనే ఘాటైన విమర్శలు చేసిన మాజీ మంత్రి జేసీ మరోసారి సమైక్యగళం వినిపించారు.  ఎవరెన్ని చేసినా సమైక్య వాదాన్ని వీడబోనన్నారు. కాంగ్రెస్‌ కు ఎంతో సేవచేశానన్న జేసీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎటు పోవాలో తేల్చుకోలేకపోతున్నానని చెప్పారు.

అసెంబ్లీలో టీ బిల్లుపై తక్షణ చర్చకు పట్టుబట్టిన వారికి సభను అడ్డుకోవడం ద్వారా సమాధానం చెప్పామని మంత్రి శైలజానాథ్ అన్నారు. బిల్లుపై ఇంకా చర్చ ప్రారంభం కాలేదని చెప్పారు. విభజనపై  అనేక అభ్యంతరాలు ఉన్నాయన్నారు.

ఇక అసెంబ్లీ జరిగిన తీరుపై టీ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర ప్రాంత నాయకులు సహకరించాలని కేంద్రమంత్రి బలరామ్ నాయక్ సూచించారు. టీ బిల్లును అడ్డుకునే కుట్రలను సాగనివ్వబోమని కేంద్రం తన మనస్సులో తెలంగాణ ప్రకటించుకుందని ఎంపీ విజయశాంతి అన్నారు. సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు చేసినా..ప్రత్యేక తెలంగాణ ఆగదని స్పష్టం చేశారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దని రాములమ్మ హితవు పలికారు.

అటు సమైక్య సమరంలో దూకుడుగా ఉన్న సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలకు తప్పుడు సమాచారమిచ్చి రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కూర్చొని కుట్రలు పన్నుతున్నారని ఆపార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమ మండిపడ్డారు. ఇక టీ-బిల్లుపై చర్చకోసం తీవ్రంగా పట్టుబట్టిన టీటీడీపీ ఎమ్మెల్యేలు సీమాంధ్ర నేతలతో పాటు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పైనా  విమర్శలు గుప్పించారు. పార్టీని వీలినం చేయకపోవడంవల్లే విభజన ఆలస్యమవుతుందన్న మోత్కుప్లలి, ఈ డీల్ జరగకపోతే తెలంగాణ రాదని తేల్చిచెప్పారు.

సమైక్యాంధ్రకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసేంత వరకు అసెంబ్లీని జరగనివ్వబోమని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తేల్చిచెబుతోంది.  సీఎం  కిరణ్  సీమాంధ్ర ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు MLA భుమాన కరుణాకర్‌రెడ్డి మరోవైపు మండలిలో విభజన బిల్లుపై కిరణ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. అసెంబ్లీలో బిల్లు టేబుల్ అయ్యిందని చర్చ మొదలు కాలేదని సీఎం కిరణ్ చెప్పడాన్ని ఈటెల రాజేందర్ తప్పుపట్టారు. మొత్తానికి సమైక్య, తెలంగాణ నినాదాలతో హోరెత్తిస్తున్న ప్రజాప్రతినిధులు తమ లక్ష్య సాధన కోసం పార్టీలను పక్కనపెట్టడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తాజా పరిణామాలు పార్టీ చీఫ్ లను  కలవరానికి గురిచేస్తున్నాయి.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s