టీ.బిల్లుపై చర్చమొదలవలేదన్న సీఎం కిరణ్

  • స్పీకర్, మండలి ఛైర్మన్ ప్రొసీడింగ్స్ తెలుసుకున్నాకే..
  • యూపీ, బిహార్ ప్రొసీడింగ్స్‌ను స్పీకర్‌కు అందజేత
  • ఇప్పటి వరకూ 20 నుంచి 30 శాతమే మాట్లాడా
  • అసెంబ్లీలోనే మొత్తం నిరూపిస్తా…:సీఎం కిరణ్
  • చివరి బంతికి చాలా సమయం ఉందన్న కిరణ్     

పైలిన్ తుఫానును ఆపలోకపోయాను కాని విభజన తుఫాన్‌ను ఆపుతానన్న మాటలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నాను. ఆఖరి బంతికి ఇంకా చాలా సమయం ఉంది. అసెంబ్లీలో నేనేంటో నిరూపిస్తాను.., తనకు ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదంటూ… సీఎం కిరణ్.. వైరి పక్షాలపై శివాలెత్తారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడినా… అంతర్లీనంగా.. మ్యాచ్ ముగియలేదని.. దుమ్ము రేపుతానని విపక్షాలకు పరోక్షంగా సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా సమైక్యంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వాయిదా పడ్డాక తన ఛాంబర్ లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా కిరణ్ మాట్లాడారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఇంకా చర్చ ప్రారంభం కాలేదని కేవలం టేబుల్ మాత్రమే అయిందని సీఎం స్పష్టం చేశారు.

స్పీకర్‌తో పాటు, మండలి ఛైర్మన్… ప్రొసీడింగ్స్ పూర్తి స్థాయిలో తెలుసుకున్నాకే.. బిల్లుపై చర్చ ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బిహార్ అసెంబ్లీకి సంబంధించిన ప్రొసీడింగ్స్ ను స్పీకర్, మండలి ఛైర్మన్‌లకు అందించినట్లు సీఎం కిరణ్ తెలిపారు.

తాను ఇప్పటివరకు రాష్ట్ర విభజనకు సంబంధించి కేవలం 20 నుంచి 30౦ శాతం వరకు మాత్రమే మాట్లాడనని.. మిగతాదంతా అసెంబ్లీలో మాట్లాడతానని సీఎం చెప్పుకొచ్చారు. అసలు తానేంటో అసెంబ్లీలోనే నిరూపిస్తానని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. తాను రెండు ప్రాంతాలకు ముఖ్యమంత్రిగానే ఆలోచిస్తున్నానని.. తన నిజాయితీ గురించి ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని దుమ్ము దులిపారు.

ఇప్పటికీ సమైక్యవాదినే అన్న కిరణ్.. విభజన విషయంలో… చివరి బంతికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పకొచ్చారు. తనకు తాను ఫైటర్ గా చెప్పకున్న కిరణ్ కుమార్ రెడ్డి.. సమైక్యం కోసం ఆఖరి వరకు పోరాడతానని అన్నారు. రాష్ట్రం విడిపోవాలో.. లేక సమైక్యంగా ఉండాలో అసెంబ్లీ నిర్ణయిస్తుందని.. తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఎమ్మెల్యేలు ఏం చెబుతున్నాదరన్నది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s