విభజన కోసం కొందరు, సమైక్యం కోసం మరికొందరు

పార్టీలన్నీ బొల్లారం వైపే అడుగులేస్తున్నాయి. విభజన రాజకీయాల్ని రక్తి కట్టించేందుకు నగర శివారు వైపు పరుగులు తీస్తున్నాయి. విభజన కోసం కొందరు, సమైక్యం కోసం మరికొందరు అటు వైపు వెళ్తున్నారు. ఇంతకీ బొల్లారంలో ఏముంది? విభజన ఆపే శక్తి అక్కడ ఉందా? ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే మంత్రం ఉందా?

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌ వచ్చారు. శీతాకాల విడిది పేరుతో  భాగ్యనగరంలో మకాం వేశారు. కానీ ఇదే సమయంలో ఇక్కడ విభజన అంశం కీలక దశలో ఉంది. అసెంబ్లీ, మండలిలో చర్చ, వాయిదాల పర్వంతో విషయం వేడెక్కిపోయింది. ఇది యాధృచ్చికమే అయినా ఇప్పుడు నేతల చూపంతా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంపైనే పడింది. గతంలో ఢిల్లీ వెళ్ళి విభజన త్వరగా చేయాలని ఓ ప్రాంత నేతలు కలిసొచ్చారు. సమైక్యాంగానే ఉంచాలంటూ మరో ప్రాంత ప్రజాప్రతినిధులు వినతిపత్రాలిచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్‌ రిపీట్‌ చేయబోతున్నాయి పార్టీలు.

అసెంబ్లీలో టి బిల్లుపై చర్చించాలని టీఆర్‌ఎస్‌ పట్టుబట్టింది. అయితే స్పీకర్‌ జనవరి 3 వరకు శాసనసభను వాయిదా వేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్ళే పనిలో పడింది టీఆర్‌ఎస్‌. బిల్లుపై వెంటనే చర్చ జరపడంతో పాటు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేయాలని భావిస్తోంది. అటు టీడీపీ సైతం ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరింది. విభజనలో సమన్యాయం కనిపిచడం లేదని దాదాకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. హడావిడిగా బిల్లు పెట్టకుండా మరోసారి చర్చలు జరిపితే బెటరన్న వాదన వినిపించాలని చూస్తోంది.

కాంగ్రెస్‌ నుంచి ఇరు ప్రాంత నేతలు వేర్వేరుగా ప్రణబ్‌ను కలిసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. విభజన కోసం ఒక బృందం, సమైక్యకోసం మరోబృందం ప్రెసిడెంట్‌కు వినతిపత్రాలివ్వనుంది. ఇక వైసీపీ కూడా సమైక్యం కోసం ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి లేఖ ఇచ్చినా… ఇప్పుడు అందుబాటులో ఉండటంతో మరోసారి అదే పని చేయాలని చూస్తోంది. అంతేకాక ఆపార్టీ ఎమ్మెల్యేలు సమైక్యం కోరుతూ అఫిడవిట్లూ ఇవ్వనున్నారు. మిగతా పార్టీల ఎమ్మెల్యేలూ కలిసిరావాలని ఆ పార్టీ చీఫ్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

విభజన విషయంలో రాష్ట్రపతి నేరుగా కల్పించుకొనే వీలులేదు. ఈ విషయం మన నాయక గణానికి తెలుసు. కానీ నేతలంతా ప్రణబ్‌ చుట్టూ తిరుగుతున్నారు. అందులోనూ హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండటంతో  ఓసారి వెళ్ళొస్తే పోలా అన్నట్లు ఇరుప్రాంత నాయకులు వ్యవహరిస్తున్నారు. మరి రాష్ట్రపతి వీరి వినతులపై స్పందిస్తారా. పార్లమెంట్‌ నిర్ణయం మేరకే వ్యవహరిస్తారా చూడాలి.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s