ప్రజల ఆరోగ్యంతో చెలగాటం-నిద్రమత్తులో సర్కార్

జంతు కళేబరాల దందా కొందరికి కాసులు కురిపిస్తుంటే మరికొందరికి ప్రాణసంకటంగా మారుతోంది. నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్న కంపెనీలు సామాన్య జనం ప్రాణాలతో చెలగాటమాడేస్తున్నాయి. వ్యర్థాలను ఊళ్ళపైకి వదిలి… కాసులు లెక్కిస్తున్నాయ్‌. కృష్ణా జిల్లా కొండపల్లిలోని బోన్‌ ఫ్యాక్టరీ నిత్యకృత్యంపై టీవీ ఫైవ్‌ టాస్క్‌ఫోర్స్‌ స్టోరీ.

ఇది కృష్ణా జిల్లాలోని కొండపల్లి పారిశ్రామిక వాడ. దీని చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఉపాధి కల్పించిన మాట పక్కనపెడితే ఇప్పుడు ప్రాణాలను హరిస్తోంది. ఇక్కడ వెలువడుతున్న కాలుష్యం ప్రజల్ని భయపెడుతోంది. ఎముకలను సేకరించి పిండి చేసే బోన్‌ మిల్లు నుంచి వెలువడుతున్న దుర్గంధంతో స్థానికులు అల్లాడిపోతున్నారు.

ఇక్కడున్న జంతుకళేబరాల శుద్ధి కర్మాగారంలో ఎముకలకు రసాయనాలు అద్ది దుర్గంధం రాకుండా చేస్తారు. ఆ తర్వాత నీళ్ళలో ఉడికిస్తారు. మాంసం ఏమీ లేకుండా చేసి ఆ తర్వాత డ్రై చేస్తారు. చివరగా వాటిని పొడి చేస్తారు. ఈ పొడిని ఎరువులు, ఇతర రకాల మందుల తయారీ కోసం ఎగుమతి చేస్తుంటారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎముకలను ఉడకపెట్టిన నీటిని బోన్‌మిల్‌ బయటకు వదిలేస్తోంది. ఫలితంగా ఆనీటి వల్ల భూగర్భ జలాలు విషతుల్యంగా మారిపోతున్నాయి. మరోవైపు దుర్వాసన అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ వాసన వల్ల గర్భిణుల్లో మార్పులొస్తాయని స్థానికులు అంటున్నారు. కడుపులో పిండానికి అంగవైకల్యం వస్తుందని వాపోతున్నారు.

అసలు నిబంధనల ప్రకారం ఈ ఫ్యాక్టరీలోని వ్యర్ధమైన నీటిని ప్రత్యేక కాల్వలోకి వదలాలి. ఫ్యాక్టరీ చుట్టూ 24 అడుగుల ఎత్తు గోడ నిర్మించాలి. వీటితో పాటు ఇఐఎ, ఇఎంఏ, పిసిబి సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి. కానీ కొండపల్లిలోని బోన్‌ మిల్లు ఈ నిబంధనలేమీ పాటించడం లేదు. ఇక్కడ పనిచేసే వారికి సైతం ఎటువంటి రక్షణ కవచాలు లేవు. కనీసం ముఖానికి మాస్క్‌లు కూడా ఇవ్వడం లేదు. పైగా ఇవ్వాల్సిన జీతాన్ని తగ్గించి మరీ ఇస్తున్నట్లు సమాచారం.

బోన్‌మిల్‌ నుంచి వస్తున్న వ్యర్ధాల కారణంగా తాము అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళపోవడం తప్ప చేసేది లేదంటున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s