జనాలను బురిడి కొట్టిస్తున్న కంత్రీలు

అమితాబ్‌తో మాట్లాడే అవకాశం వస్తే మీరు వదులుకుంటారా? కాకపోతే ఆడిషన్స్‌ కోసం పాతిక వేలు కట్టాలి. తర్వాత లక్ష వరకు సమర్పించుకోవాలి. ఇంతకుముందు అలా అడగలేదే అనే డౌట్‌ రావొచ్చు. ఆ సందేహం వస్తే.. మీరు లక్కీ. రానివాళ్లు బకరా!

టీవీ రియాల్టీ షోల్లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి ఓ ట్రెండ్ సెట్టర్‌. అమితాబ్‌ స్టైల్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్. ఈ షోలో పాల్గొనడం కోట్లాది మందికి డ్రీమ్. బిగ్‌బీ పక్కన మెరిసిపోయే ఆ లక్కీఛాన్స్‌ అందరికీ రాదు. వస్తే.. ఏమాత్రం వదులుకోరు. జనాల్లోని ఈ బలహీనతని మోసగాళ్లకు సొమ్ము చేసుకుంటున్నారు.


మీకో ఫోన్‌కాల్‌ వస్తుంది. తియ్యటి స్వరం మధురంగా పలకరిస్తుంది. ప్రపంచంలోనే మీ అంత లక్కీఫెలో లేరంటూ… రాత్రికిరాత్రే కోటీశ్వరుడివి కావొచ్చంటూ ఒయ్యారాలు పోతుంది. ఆడిషన్స్‌కి జస్ట్‌ పాతిక వేలు కట్టాలంటూ స్వీట్‌గా కోరతారు. ఫ్లాట్‌ అయ్యారో… ఖేల్‌ ఖతం… సొమ్ములు మాయం. కోటీశ్వరుడ్ని కాబోయే ముందు పాతికవేలు ఓ లెక్కా అనుకుంటూ చాలామందే ఆ మాయలో పడ్డారు. అయితే.. ఆ బురిడీ పాతికవేలతో ఆగదు. ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకని మాయగాళ్లు లక్ష వరకు నొక్కేస్తున్నారు. హైదరాబాద్‌లోనే పదుల సంఖ్యలో బాధితులున్నారు. సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది. మూగబోయిన ఫోన్‌ నెంబర్లు, అకౌంట్‌ నెంబర్లే ఆధారంగా పోలీసులు విచారణ సాగించారు. తీగ లాగితే ఢిల్లీలో డొంక కదిలింది. లాటరీ తగిలిందని ఊరించే ఇ-మొయిళ్లు, కోటీశ్వరులైపోతారనే ఫోన్‌ కాల్స్‌ని నమ్మొద్దని పోలీసులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , . Bookmark the permalink.

One Response to జనాలను బురిడి కొట్టిస్తున్న కంత్రీలు

 1. Saati eluguvadu says:

  It’s quite unfortunate , the same day I watched two news clippings from tv5 . Both the news resembled a song “pavuraniki panjaraniki Pelli chese padulokam ” from Telugu movie chanti:)
  Just to let every one enjoy , aim posting poth the news.
  1. https://tv5news.wordpress.com/2013/12/23/జనాలను-బురిడి-కొట్టిస్తు
  2. http://ap7am.com/lv-136107-congress-and-aap-political-plans-on-2014-elections.html
  3. Telugu cine industry loosing a star every month , who is next month 6th!!!!! …. This is a great horoscope by TV5

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s