కాంగ్రెస్‌లో ముఖ్యనేతల మధ్య దూరం పెరుగుతోంది. ఎంత చెప్పినా, ఏం చేసినా తెలంగాణను అడ్డుకోలేరంటున్న టీ నేతలు… మోకాలడ్డుతున్న సీమాంధ్ర నాయకులకు కౌంటర్లిస్తున్నారు. సీఎం కిరణ్‌పై టీ నేతలు ఎప్పటి నుంచో నిప్పులు చెరుగుతున్నా తాజాగా ఉపముఖ్యమంత్రి తూటాల్లాంటి మాటలతో కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు.


రాష్ట్ర విభజన తుది అంకానికి చేరింది. అసెంబ్లీలో చర్చ పూర్తయితే… 90 శాతం విభజన జరిగినట్లే. ఇక పార్లమెంట్‌లో ఓటింగ్‌, ఆపై రాష్ట్రపతి రాజముద్రే తరువాయి. అయితే విభజనకు ముందే రాష్ట్ర నేతల మధ్య భారీ అంతరం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం తారా స్థాయికి చేరిన నాటి నుంచి ఈ పరిస్థితి ఉన్నా ఎప్పుడు బయట పడింది లేదు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అంతా బయటకు సఖ్యతగానే ఉన్నారు. ఒకరిదద్దరు ఓపెన్‌గా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నా మిగిలిన వారంతా మేమొక్కటే అన్న సంకేతాలిచ్చారు. విభజనపై సీడబ్ల్యుసీ నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి ధిక్కార స్వరం వినిపించడంతో తెలంగాణ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు.

ప్రస్తుతం బిల్లు అసెంబ్లీకొచ్చేసరికి పరిస్థితి తారుమారయ్యింది. నేతల మధ్య పూడ్చలేని అగాధం మొదలైంది. సీమాంధ్రా నేతల తీరు టి నేతలకు సిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. ఇన్నాళ్ళు సీఎం తెలంగాణకు ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అడపా, దడపా బహిరంగంగా కౌంటరిచ్చారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరంటూనే ఆయన ముందుకెళ్ళారు. కానీ ఈ ఆఖరి సమయంలో కిరణ్‌, రాజనర్సింహ మధ్య ఉన్న మనస్పర్ధలు బయటపడ్డాయి. కొంతకాలంగా సీఎంపై గుర్రుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి ఒక్కసారిగా బరస్ట్‌ అయ్యారు. తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారి మనోభావాలు గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకొనేందుకే కిరణ్‌ కుట్రపన్నుతున్నారంటూ ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు.

ఒక్కసారిగా డిప్యూటీసీఎం ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం ఏంటి ? సీఎం వ్యవహారా శైలే అందుకు కారణమా ? బిల్లుపై చర్చ విషయంలో కిరణ్‌ చేసిన తాత్సారమేనా ? కాంగ్రెస్‌లో ఇదే విషయమై ఇప్పుడు హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. అయితే ఎలాగూ విభజన ఖాయమని తెలిసినప్పుడు సీఎం చేస్తున్న బహిరంగ వ్యాఖ్యల్ని ఖండించకపోతే ప్రజల్లోకి ఎలా వెళ్తామన్న ఉద్దేశ్యంతోనే రాజనర్సింహ క్లైమాక్స్‌ సీన్‌ను రక్తికట్టించేందుకు నోటికి పనిచెబుతున్నారని విశ్లేషకులంటున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s