ఆదివారం బిజీబిజీగా ఢిల్లీ సీఎం

  • ఇంటి నుంచే విధులు నిర్వర్తించిన కేజ్రీవాల్‌
  • ఇంటి వద్ద ప్రజాదర్బార్‌ నిర్వహణ
  • కేజ్రీవాల్‌ను కలిసిన డీటీసీ ఉద్యోగులు, వాల్మీకీ కమిటీ ప్రజలు
  • వారం-పది రోజుల గడువు కోరిన కేజ్రీవాల్‌
  • సోమవారం నుంచి ప్రతీ ఇంటికి 700లీటర్ల మంచి నీరు
  • మంగళవారం కొత్త కరెంట్‌ టారీఫ్‌ ప్రకటన
  • మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం: రాఖీ బిర్లా
  • కేజ్రీవాల్‌పై లాలూ విమర్శలు
  • రాహుల్‌ ముందు కేజ్రీవాల్‌, మోడీ వేస్ట్‌: లాలూ
  • కేజ్రీవాల్‌ను ఎన్నుకుని ఢిల్లీ ప్రజలు తప్పు చేశారు‌: లాలూ
  • సీఎంగా కేజ్రీవాల్‌ వరెస్ట్‌ రికార్డ్‌ నెలకొల్పుతారు‌: లాలూ

ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరవింద్‌ కేజ్రీవాల్ తనదైన శైలిలో పనిచేసుకు పోతున్నారు. ఆదివారం సెలవు దినమైనా.. ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. ప్రజాదర్బార్‌ నిర్వహించి సమస్యలు విన్నారు. వారం రోజుల గడువు ఇవ్వండి సమస్యలన్నీ పరిష్కరిస్తానని ప్రజలను కోరారు. మరోవైపు.. కేజ్రీవాల్‌పై ఆర్జేడీ అధినేత లాలూ చేసిన వ్యాఖ్యలపై ఆపార్టీ మండిపడింది.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం… తొలిరోజే ఆరు గంటల పాటు నిర్విరామంగా పని చేసిన కేజ్రీవాల్‌.. ఆదివారం కూడా రెస్ట్‌ తీసుకోలేదు. సెలవు దినం కావడంతో.. ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. ఢిల్లీ కూషంబీలోని కేజ్రీవాల్‌ ఇల్లు సండే నాడు… సందర్శకులతో నిండిపోయింది.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు చెప్పేవాళ్లు కొందరైతే.. తమ సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారు మరికొందరు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు.. వాల్మీకీ కమిటీ ప్రజలు.. కేజ్రీవాల్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. జనాన్ని అదుపు చేయడానికి కేజ్రీవాల్‌ పోలీసుల సహాయం కోరారు.

హామీలు నెరవేర్చడానికి… పరిస్థితి చక్కదిద్దడానికి.. వారం-పది రోజుల సమయం కావాలన్నారు కేజ్రీవాల్‌. సోమవారం కల్లా నీటి సరఫరా మెరుగుపరుస్తామని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ప్రతీ ఇంటికీ.. 700లీటర్ల నీటిని అందిస్తామని చెప్పారు. కరెంట్‌ బిల్లులు సగానికి తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. అందుకు తగ్గట్టు మంగళవారం నాడు కొత్త టారీఫ్‌ ప్రకటిస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు. ఇంకా చాలా చేయాల్సి ఉందని.. ప్రజలంతా తమకు సహకరించాలని కోరారు.

మరోవైపు… ఢిల్లీలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి రాఖీ బిర్లా తెలిపారు. నిర్భయ ఘటన జరిగి ఏడాదైన సందర్భంగా.. జరిగిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. మహిళా రక్షణ విషయంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా మెదలాలని పిలుపిచ్చారు.

ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌గాంధీతో పోల్చితే కేజ్రీవాల్‌, మోడీలు వేస్ట్‌ అన్నారు. కేజ్రీవాల్‌ను ఎన్నుకుని ఢిల్లీ ప్రజలు తప్పు చేశారని.. త్వరలోనే వారు చేసిన తప్పు తెలుసుకుంటారన్నారు. సీఎంగా కేజ్రీవాల్‌ వరెస్ట్‌ రికార్డ్‌ నెలకొల్పుతారని జోస్యం కూడా చెప్పారు. లాలూ వ్యాఖ్యలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s