సొంత పార్టీ దిశగానే కిరణ్ అడుగులు వేస్తున్నారా..?

సొంత పార్టీ దిశగానే కిరణ్ అడుగులు వేస్తున్నారా..?  జనవరి 23 తర్వాత కిరణ్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారా..? కిరణ్ పార్టీ పెడితే సీమాంధ్రలో మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందులో చేరతారా..?  ఇప్పుడు ఇదే కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా  మారింది.

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుందని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా జనవరి నెలాఖరుకు సీఎం కిరణ్  తన పదవికి రాజీనామా చేసి.. కొత్త పార్టీ ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.అయితే ఈ లోపు సమైక్య ఉద్యమాన్ని  ఉధృతం చేసి.. పార్టీకి అనుకూల  పరిస్థితులు కల్పించేందుకు కసరత్తు కూడా ముమ్మరంగా జరుగుతుందని ప్రచారం జరగుతోంది.

ఎపీఏన్జీఓలు ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర పరిరక్షణ వేదికల  ద్వారా ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున  జరగనున్నాయి. ప్రతి జిల్లాల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కార్యలయాలు కూడా ఏర్పాటు  కాబోతున్నాయి. ఇవే భవిష్యత్‌ తో కిరణ్ పెట్టబోయే పార్టీ ఆఫీసులుగా మారే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.. మొత్తానికి ఈ నెలాఖరుకు కిరణ్‌  సొంత పార్టీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.

విభజన ముసాయిదా బిల్లుపై ఈ నెల 23 తర్వాత  అసెంబ్లీ అభిప్రాయం చెప్పేందుకు మరింత గడువు కావాలని  సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతిని కోరే  అవకాశముంది. అసెంబ్లీ అభిప్రాయం చెప్పేందుకు రాష్ట్రపతి గడువు పెంచేందుకు  ససేమిరా  అంటే.. వెంటనే శాసనసభను రద్దు చేసి… సొంత పార్టీ దిశగా  అడుగులు వేయాలని కిరణ్‌ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.. అటు కిరణ్‌కు అండగా  ఇప్పటికే సీమాంధ్రకు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు  ప్రకటిస్తున్నారు.. కాంగ్రెస్ తడిగుడ్డతో తమ గొంతులు కోసిందని.. ఆ పార్టీకి  వీర విధేయత ప్రకటించే ఉండవల్లి కూడా అంటున్నారంటే… కిరణ్‌ గ్రూపు  త్వరలోనే సొంత కుంపటి పెట్టడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

ఇక అటు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారనేది తాజా పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ల్లో తమకు పార్టీ టిక్కెట్లను అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు.. పీసీసీ  ఇప్పటికే పార్టీ నుంచి 26 మంది బయటకు వెళ్లవచ్చని ఓ జాబితా తయారు చేస్తే.. సీఎం వర్గానికి చెందిన లగడపాటి మాత్రం 70 మంది  కాంగ్రెస్  ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

అంటే… 70 మందిలో మెజార్టీ ఎమ్మెల్యేలు కిరణ్ పెట్టే పార్టీలో చేరవచ్చని  గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి పది మంది ఎంపీలు  కాంగ్రెస్ పార్టీని వీడతారని లగడపాటి చెప్పుకొస్తున్నారు.

ఈ పదిమంది ఎంపీలు  కూడా కిరణ్ పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. సోనియాను కలవకుండానే కిరణ్ హైదరాబాద్ తిరిగి రావడం.. పార్టీ కార్యక్రమాలకు  కూడా దూరంగా ఉండటంతో.. ఇక కాంగ్రెస్‌తో తెగదెంపులకే కిరణ్ సిద్ధపడ్డారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి.. మొత్తానికి జనవరి నెలాఖరుకు కిరణ్ కొత్త  పార్టీ జనాల్లోకి వచ్చే అవకాశముందని ఆయన వర్గం బలంగా నమ్ముతోంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s