ఏపీపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్

  • నల్గొండ -రఫిక్ అహ్మద్
  • కర్నూలు – ప్రమోద్ మద్వరాజ్
  • విజయనగరం – వి.అవారి
  • అనకాపల్లి – యశ్వంత్ రాయ్
  • తిరుపతి – ఆర్‌.వి.వెంకటేష్
  • రాజంపేట్ – గోవిందరాజు
  • హైదరాబాద్ – జయధరణి
  • మెదక్ – బస్వరాజ్ పటేల్
  • రాజమండ్రి – డాక్టర్ సుధాకర్
  • చిత్తూరు – ఎం.ఆర్. సీతారాం
  • మల్కాజ్ గిరి – ప్రకాష్ ఎల్‌ గుల్వార్

ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై AICC దృష్టి సారించింది. ఇందుకోసం  హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ దూతలు  క్షేత్రస్థాయిలో పర్యటించి బలమైన అభ్యర్థులను గుర్తించనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్లను అధిష్ఠానానికి పంపనున్నారు. ఏఐసీసీ ప్రతినిధుల రూట్ మ్యాప్ ను పీసీసీ చీఫ్ బొత్స ఖరారు చేశారు.

సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర శాసనసభకు పోటీకి నిలిపే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. గెలుపు గుర్రాల అన్వేషణకు హైకమాండ్ వేగులను రంగంలోకి దింపింది. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల పనితీరును ఢిల్లీ దూతలు ఆరా తీస్తున్నారు. అశావాహుల వివరాలు సేకరిస్తునే ప్రత్యర్థుల బలాలను అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటించి..తమకు లభించిన సమాచారాన్ని అధిష్టానానికి అందించనున్నారు.

తొలివిడతగా 11మంది ఏఐసీసీ ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. నల్గొండకు రఫిక్ అహమద్, కర్నూలులో ప్రమోద్ మద్వరాజ్, విజయనగరం జిల్లాలో వి.అవారి పర్యటించనున్నారు. ఇక అనకాపల్లిలో యస్వంత్ రాయ్, తిరుపతి సెగ్మెంట్ కు  ఆర్‌వి వెంకటేష్ , రాజంపేటకు గోవిందరాజు వెళ్లనున్నారు. హైద్రాబాద్ లోక్ సభ పరిధిలో జయధరణి ,మెదక్ బస్వరాజ్ పటేల్, మల్కాజ్ గిరిలో ప్రకాష్ ఎల్‌ గుల్వార్ టూరేయనున్నారు. రాజమండ్రికి డాక్టర్ సుధాకర్, చిత్తూరులో ఎంఆర్ సీతారాం పర్యటించనున్నారు.

హైద్రాబాద్ వచ్చిన ఏఐసిసి ప్రతినిధులు  పిసిసి అధ్యక్షుడు బొత్సతో సమావేశమై రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. ప్రతి రోజూ రెండు లేదా మూడు సెగ్మెంట్ల నేతలతో భేటీ కానున్నారు.  ఈనెల 9న మేడ్చల్, మల్కాజిగిరి.. 10న కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్…11న ఎల్‌బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నాయకులతో సంప్రదింపులు జరుపనున్నారు.  తొలి విడత అభ్యర్థుల ఎంపిక కోసం ఈనెల 15 వరకూ పరిశీలన జరుగుతుంది.  మలి విడత కసరత్తు మాత్రం ఏఐసీసీ సమావేశం తర్వాత ఉంటుందని తెలుస్తోంది.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s