మోడీ పబ్లిసిటీకి కేజ్రీవాల్ గండం

దేశంలో ఎక్కడ చూసినా మోడీ మేనియా చేసిన పట్టణ ఓటర్లు… ఇప్పుడు ఓ సామాన్యుడివైపు చూస్తున్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌ వ్యతిరేక ఓటు తమకు అనుకూలమైతే..ఈజీగా హస్తిన పీఠం దక్కించుకోవచన్న కమలనాథుల ఆశలకు చీపురు అడ్డుపడనుంది. ఇన్నాళ్లు మోడీ మంత్రం జపించిన యువత కేజ్రీవాల్‌ వైపు చూస్తున్నారు. దీంతో UPA సర్కార్ నెగటివ్ ఓటు బ్యాంక్ ఎవరికి ప్లస్ అవుతుందన్న విశ్లేషణలు అప్పుడే ఊపందుకున్నాయి.

నరేంద్ర మోడీ… దేశవ్యాప్తంగా క్రేజీ ఉన్న లీడర్‌. ప్రధాన అభ్యర్థిగా కమలనాథులు ప్రకటించారు. నెల క్రితం వరకు మోడీ అంటే ఓ క్రేజ్.. కానీ ఇప్పుడిప్పుడే ఆ జోరుకు బ్రేక్‌లు పడుతున్నాయి. ఢిల్లీకే పరిమితమైన కేజ్రీవాల్ ను.. మోడీతో ఎలా పోల్చగలమంటూ లెక్కలు వేశారు. కానీ చాపకింద నీరులా విస్తరిస్తున్న నష్టాన్ని ఇప్పుడిప్పుడే కమలనాథులు పసిగడుతున్నారు. వేటి ద్వారా మోడీ తన ఇమేజ్‌ ను పెంచుకునే ప్రయత్నాలు చేసారో .. అవన్నీ ఇప్పుడు కేజ్రీవాల్ సొంతమయ్యాయి.

ముఖ్యంగా సోషల్ నెట్ వర్క్‌… మీడియా పూర్తిగా కేజ్రీ మంత్రం జపిస్తోంది. అటు ట్విట్టర్‌లో నరేంద్ర మోడికీ కేజ్రీవాల్ గట్టి పోటినే ఇస్తున్నారు. ఇప్పటికే 424 పాయింట్లతో కేజ్రీవాల్ ముందు వరుసలో ఉండగా .. 218 పాయింట్లతో మోడీ రెండో స్థానం …157 పాయింట్లతో రాహూల్ మూడో స్థానంలో నిలిచారు. ఈ రేటింగ్‌ను బట్టి చూస్తే డిసెంబర్‌ 8కి ముందు మోడీ జపం చేసిన యువత .. ఇప్పుడు కేజ్రీవాల్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు.

కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఆమ్ ఆద్మీ అధినేత పేరే వినిపిస్తోంది. అటు బీజేపీని అధికారంలోకి రాకుండా కేజ్రీవాల్ అడ్డుపడుతారనే ఆందోళన సీజనల్ పొలిటిషియన్స్‌ను కంగారు పెట్టిస్తోంది. కేజ్రీవాల్ ప్రాక్టికాలిటీ ముందు మోడీ పబ్లిసిటీ మంచులా కరిగిపోయింది.

యూపీఏ సర్కార్ వ్యతిరేక ఓటు తమసొంతమంటూ ఆనందపడ్డ బీజేపీ నేతలకు కేజ్రీవాల్ చెక్ పెడతారనే ఆందోళన వెంటాడుతోంది. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్‌ కోటను కూల్చడంతో పాటు… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లారు. పనిలో పనిగా రెండో విడతలో హర్యానా, పంజాబ్, పశ్చిమ యూపీలో గట్టి దెబ్బ కొడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ బహుముఖ పోటీనే… హర్యానా, యూపీ, బీహార్‌ రాష్ట్రాల్లో ఒక్కోచోట నాలుగు పార్టీలు తలపడుతున్నాయి.

దీంతో ఆమ్ ఆద్మీ మేనియా ఆ పార్టీకి పూర్తి మెజార్టీ సీట్లు తెప్పించకపోయినా … ఇతర పార్టీల అవకాశాలను తలకిందులు చేసే ఛాన్స్‌ ఉంది. దీంతో బీజేపీ పునరాలోచనలో పడి మోడీని ఎలా ప్రొజెక్ట్‌ చేయాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే అన్ని ఐడియాలను పూర్తిగా వాడేసింది. త్రీడీ నుంచి యాప్ వరకు అన్నీ అయిపోయాయి.  ఇప్పుడు మోడీ క్రేజ్‌ సడెన్‌గా కేజ్రీవాల్ చుట్టూ తిరుగుతోంది. మోడీకి జై కొట్టిన అర్భన్ ఓటు బ్యాంక్ అంతా ఆమ్ ఆద్మీ జపం చేస్తోంది. దీంతో ఎవరి ఓట్లు కొల్లగొట్టి..  ఏపార్టీని దెబ్బ తీస్తాయోనన్న ఆందోళన ప్రధాన నేతలను వెంటాడుతోంది.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s