కష్టాల్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం

  • కష్టాల్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం
  • కేజ్రీవాల్‌కు రెబెల్ ఎమ్మెల్యే బిన్నీ అల్టిమేటం
  • 48 గంటల్లో హామీల అమలుకు డిమాండ్
  • ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది: బిన్నీ
  • లైట్ తీసుకుంటున్న కేజ్రీవాల్ బృందం

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయా..  ఈనెలలోనే కేజ్రీవాల్ ప్రభుత్వం పతనమవుతుందా.. తాజా పరిణామాలు ఆ దిశగానే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. రెబెల్ ఎమ్మెల్యే బిన్నీ ఢిల్లీ సర్కార్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. ఎన్నికల వాగ్దానాలను 48 గంటల్లో అమలు చేయకపోతే తనతోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఆప్ సర్కారుకు మద్దతు ఉపసంహరిస్తామని అల్టిమేటం ఇచ్చారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వం లోని ఢిల్లీ సర్కార్‌ కష్టాల్లో పడింది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతుతో నెట్టుకొస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌ కుమార్‌ బిన్నీ అల్టిమేటం ఇచ్చారు. తనతోపాటు మరో ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆయన దుయ్యబట్టారు. 48గంటల్లో హామీలను నెరవేర్చకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ నవాబ్ జంగ్ ను కలిసి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని తేల్చిచెప్పారు.

అటు బిన్నీతోపాటు జేడీయూ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, ఇండిపెండెంట్ రాంబీర్ కూడా కేజ్రీవాల్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ద సమస్యల పరిష్కారంలో చూపడం లేదని విమర్శించారు.

ఢిల్లీలో ఇటీవల పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని సామాన్యులపై పడకుండా ప్రభుత్వమే భరించాలని బిన్నీ డిమాండ్ చేశారు. పార్టీ నాయకత్వంపట్ల అసంతృప్తిగా ఉన్న పార్టీలోని ఇతర ఎమ్మెల్యేల గొంతు నొక్కేందుకే తనపై వేటువేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుందని బిన్నీఆరోపించారు. అర్ధరాత్రి దాడి సందర్భంగా ఉగాండా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిం చిన న్యాయ శాఖ మంత్రి సోమ్‌నాథ్‌ భారతిపై చర్య తీసుకోవాలని బిన్నీ డిమాండ్‌ చేశారు.

అటు బిన్నీవార్నింగ్ ను ఆప్ వర్గాలు లైట్ తీసుకున్నాయి. తాము అధికారం కోసం వెంపర్లాడడంలేదని.. రాజకీయ లబ్ధి కోసమే బిన్నీ వ్యవహరిన్నారని ఎదురు దాడికి దిగింది. బీజేపీతో కుమ్మక్కై తమ ప్రభుత్వాన్ని బలహీనపర్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటినీ ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మొత్తం మీద సంచలన విజయంతో అధికారంలోకి వచ్చిన ఆప్ పార్టీ అంతే స్పీడుగా కనుమరుగవుతుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానమవ్వాలి.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s