YCP ప్లీనరీలో జగన్‌ జన గర్జన

ఎన్నికల నగారా మోగించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌.. ఇడుపులపాయ వేదికగా జగన్‌ జనగర్జన చేశారు. విభజన రాజకీయాల్ని కడిగేశారు. ప్రత్యర్ధుల విమర్శల్ని తిప్పికొట్టారు. త్వరలో అధికారంలోకి రాబోయేది వైసీపీనే అంటూ కార్యకర్తల్లో కొండత ధైర్యాన్ని నింపారు. పేదలకు సంక్షేమం అంటే ఏంటో చూపిస్తానని భరోసా ఇచ్చారు. ప్రత్యర్ధుల గుండెల్లో గుచ్చుకొనేలా ప్రతీ అంశాన్ని ప్రస్తావించారు యువనేత.

కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. ఇదే ఇప్పుడు YSR  కాంగ్రెస్‌పార్టీ టార్గెట్‌. కార్యకర్తల్ని ఆ దిశగా కార్యోన్ముఖుల్ని చేయాలి. వైసీపీ ప్లీనరీలో జగన్‌ అదే చేశారు. మరో నాలుగు నెలల్లో అధికారం మనదే. ఇదే పార్టీ శ్రేణులకు యువనేత చెప్పిన తారకమంత్రం. కష్టపడ్డాం, విమర్శలు ఎదుర్కొన్నాం… ప్రజాకోర్టులో విజయం సాదిద్ధామంటూ జగన్‌ చేసిన ప్రసంగం.. కార్యకర్తలకు ఉత్తేజాన్నిచ్చింది.

రాజన్న భూమాత ఒడిలో సేదతీరుతున్న ఇడుపులపాయ వ్యవసాయక్షేత్రం సాక్షిగా వైసీపీలో కొత్త శక్తినిచ్చింది. యుద్ధానికి సిద్ధం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ ప్లీనరీ వేదికగా జగన్‌ చేసిన ప్రసంగం… రాజకీయ రణరంగానికి తెరలేపింది. ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరింది. విభజన రాజకీయాల్ని ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన రాష్ట్ర విభజన చేస్తారంటూ ఢిల్లీ పెద్దల్ని నిలదీసిన జగన్‌… జనం అండదండలతోనే ఆ కుట్రలను చేధిస్తానని భరోసా ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం తర్వాత అన్నీ ప్రతికూల పరిస్థితులే. అన్నింటినీ పార్టీ శ్రేణుల ముందుంచారు జగన్‌. ఢిల్లీ వేధింపులు… జైలు జీవితం… అంతా తెరచిన పుస్తకంలా వివరించారు. భయపెట్టినా, బెదిరించినా… వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాపక్షాన్నే నిలుస్తుందని సభా వేదిగా సగర్వంగా చెప్పారు.

రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతున్న YCPపై ప్రత్యర్థుల నిందలను జగన్‌ ప్రశ్నించారు. స్వార్థ రాజకీయం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం తగదన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం అమలు చేస్తున్న TDP అధినేత చంద్రబాబు సమైక్యం కోసం ఎందుకు పోరాడడం లేదని జగన్‌ నిలదీశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు.

సంక్షేమానికి కేరాఫ్‌ వైఎస్‌ఆర్‌. ఆ సువర్ణయుగాన్ని మళ్ళీ చూపిస్తానన్నారు జగన్‌. ప్రత్యర్ధులకు సవాల్‌ విసరడమే కాదు. ప్రజారంజక పథకాల రూపకల్పనకు ప్లీనరీ వేదికైంది. జగన్‌ ప్రతీమాట నాటి వైఎస్‌ఆర్‌ను గుర్తు చేసింది. అధికారం కోసం కాదు… ప్రజా సంక్షేమం కోసమే రాజకీయమంటూ జనహృదయాలను స్పృశించారు యువనేత. ప్రతీ ఇంటిలో ఓ బిడ్డనౌతానని భరోసా ఇచ్చారు. వృద్ధులకు 7వందల పించన్‌, డ్వాక్రా రుణాల మాఫీ, ఉచిత విద్య, వైద్యానికి మేనిఫెస్టోలో పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. పేదవాడి జీవితంలో వెలుగునిచ్చే ఆరోగ్యశ్రీ అన్ని రోగాలకు వర్తింపచేస్తానన్నారు.108, 104 సేవలను గాడిలో పెడతానన్నారు.  రైతుల కోసం 101, పశు వైద్య కోసం 102లు తీసుకొస్తామన్నారు. వికలాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకార్మికుల సంక్షేమమే YCP ధ్యేయమన్నారు.

అన్ని వర్గాల ప్రజలు పడుతున్న బాధలనే మేనిఫెస్టోలో రూపొందించింది YCP. జగన్, విజయమ్మ, షర్మిల చేసిన యాత్రలు, దీక్షల అనుభవాలను క్రోడీకరించారు. త్వరలో ముఖ్యమంత్రి కాబోయేది మీబిడ్డేనంటూ.. జగన్‌ చేసిన ప్రసంగం… వైఎస్‌ అభిమానులకు మహానేతను గుర్తు చేసింది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s