- నాలుగు అడుగుల దూరంలో రాష్ట్ర విభజన..
- టీ బిల్లుపై ఇవాళ జీవోఎం సమావేశం
- టీ బిల్లుపై అనేక అభ్యంతరాలు, సందేహాలు..
- తుదిదశ పరిశీలనలో సందేహాలకు పరిష్కారం
- బిల్లుకు అనేక సవరణలు సూచించిన అధికార, విపక్షాలు
- బిల్లులో సవరణలకు సిద్ధమైన జీవోఎం
- కుదిరితే ఇవాళ… లేదంటే రేపు…
- బిల్లుకు తుదిరూపు ఇచ్చేందుకు జీవోఎం రెడీ
- జీవోఎం నుంచి క్యాబినెట్‌కు ..
- అక్కణ్నుంచి రాష్ట్రపతికి టీ బిల్లు
- ఉభయసభల అనుమతితో చట్టంగా టీ బిల్లు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఇవాళ మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. టీ బిల్లుకు తుదిరూపు ఇచ్చేందుకు సమావేశం కానున్న బృందం సభ్యులు.. అనేక కీలక సవరణలు చేయనున్నారు. కుదిరితే ఇవాళ లేదంటే.. రేపు… ఫైనల్ బిల్లును తయారు చేసి.. క్యాబినెట్ కు పంపనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు… చట్టం రూపంలోకి మారేందుకు.. ఇంకో నాలుగు అడుగుల దూరంలో ఉంది. ఇందులో భాగంగా ఇవాళ… కేంద్ర మంత్రుల బృందం బిల్లుపై తుది దశ చర్చలు జరపనుంది. రాష్ట్రపతి ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీకి వెళ్లి సభ్యుల అభిప్రాయాలతో తిరిగివచ్చిన ముసాయిదా బిల్లు… తిరిగి ఆయన దగ్గరికి చేరింది. అనంతరం క్యాబినెట్ అనుమతి మేరకు… జీవోఎం చెంతకు వచ్చింది. అయితే బిల్లుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవడం.. దీన్ని యథాతథంగా పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చా అన్న సందేహాలు రేకెత్తడంతో… జీవోఎం సభ్యులు అప్రమత్తమయ్యారు. తుదిదశ పరిశీలనలో వీటన్నింటిపై దృష్టి సారించాలని డిసైడయ్యారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రపడాలని భావిస్తున్నారు.
అలాగే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తో పాటు.. రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు… బిల్లులోని అనేక అంశాలకు సవరణలు సూచించాయి. వీటన్నింటినీ పరిశీలించి.. చేయాల్సిన మార్పులన్నీ చేసేయాలని జీవోఎం నిర్ణయించింది. ఇవాళ సమావేశం కానున్న జీవోఎం.. మూణ్నాలుగు గంటల పాటైనా కూర్చొని.. బిల్లుకు తుదిరూపు ఇవ్వాలని భావిస్తోంది. ఒకవేళ ఇవాళ ప్రక్రియ పూర్తికాకపోతే.. రేపు మరోసారి సమావేశమై.. పని పూర్తి చేయాలని డిసైడైంది. జీవోఎం పరిశీలనల అనంతరం.. బిల్లు మళ్లీ క్యాబినెట్‌కు వెళ్లనుంది. కేంద్రమంత్రివర్గం దీనిపై ఆమోదముద్ర వేసి… మళ్లీ రాష్ట్రపతి అనుమతి కోసం పంపనుంది. అనంతరం.. బిల్లును పార్లమెంటులో పెట్టి… ఉభయసభల అనుమతి పొందాలని.. కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. పార్లమెంటు అనుమతి తర్వాత… బిల్లు చట్టంగా మారుతుంది. దీనిపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడగానే… రాష్ట్ర విభజన గెజిట్ విడుదలవుతుంది.
మొత్తం మీద ఎలా చూసుకున్నా… ఇంకో వారం, పది రోజుల్లో రాష్ట్ర విభజన పూర్తి అయిపోతుందని.. కేంద్ర ప్రభుత్వం ధీమాగా చెబుతోంది.