రాష్ట్ర విభజనపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్

రాష్ట్ర విభజనపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంట్ సమావేశాల్లో టీ-బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్.. సభలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్లాన్ చేస్తోంది. సొంత పార్టీ ఎంపీలే వ్యతిరేకిస్తున్నారన్న సుష్మా విమర్శలతో దిద్దుబాట చర్యలు చేపట్టింది. ఈ ఉదయం సీమాంధ్ర ఎంపీలతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశమవుతుండగా..సాయంత్రం వార్ రూమ్ లో ఇరుప్రాంత నేతలతో చర్చలు జరపనున్నారు.

తెలంగాణ బిల్లును పార్లమెంట్ బడ్జెట్  సెషన్ లోనే ఆమోదించుకోవాలనుకున్న కాంగ్రెస్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్లమెంటరీవ్యవహారాల మంత్రి కమలనాధ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా సొంత పార్టీ సీఎం ఎందుకు దీక్ష చేయబోతున్నారని ప్రశ్నించారు. టీ-బిల్లును ప్రవేశపెడితే సీమాంధ్ర ఎంపీలు సభను జరగనిస్తారా అని అధికార పార్టీని నిలదీసింది.

బీజేపీ రివర్స్ గేర్ తో షాకైన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంట్ లో సొంత పార్టీ సభ్యులనుంచి ఇబ్బందులు రాకుండా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సీమాంధ్ర ఎంపీలతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. టీ-బిల్లుపైనే వారితో చర్చించనున్నారు. అటు కాంగ్రెస్ కోర్ కమిటీ మంగళవారం సాయంత్రం ఇరుప్రాంత ఎంపీలు, మంత్రులతో చర్చలు జరపనుంది. మరోవైపు UPA ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు సమావేశంపై ఇంకా సమాచారం రాలేదు. లోక్ సభలో టీ-బిల్లు ప్రవేశపెట్టినపుడు అడ్డుంకులు కల్పిస్తే చర్యలు తప్పవన్న కమల్‌నాథ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అయితే  హైకమాండ్ యత్నం ఫలించి రాష్ట్ర ఎంపీలు లోక్ సభలో ప్రభుత్వానికి సహకరిస్తారా  లేదా అనేది ఉత్కంఠగా మారింది.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , . Bookmark the permalink.

One Response to రాష్ట్ర విభజనపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్

  1. Cbapujee says:

    If MPs from Seemandhra bend and bow before Rahul Gandhi shamelessly they all should wear White saris cover faces and go into oblivion for the rest of their lives.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s