మరోసారి ఢిల్లీలో జగన్ సమైక్య పోరాటం

  • ఈ సాయంత్రం రాష్ట్రపతిని కలవనున్న వైఎస్ జగన్
  • టి.బిల్లును ఆమోదించవద్దని విజ్ఞప్తి చేయనున్న జగన్
  • సమైక్యాంధ్రకు జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం
  • ఢిల్లీలో జాతీయ పార్టీల నాయకులను కలవనున్న వైసీపీ బృందం
  • పార్లమెంట్‌లో సమైక్యవాదం వినిపిస్తా: జగన్‌
  • రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకుంటా: జగన్‌

సమైక్య సేనాని జగన్‌.. మరోసారి ఢిల్లీలో సమైక్య పోరాటానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల వేదికగా సమైక్య నినాదం వినిపించనున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీ నాయకులనూ కలవనున్నారు. మరోవైపు.. ఈ సాయంత్రం రాష్ట్రపతిని కలిసి తెలంగాణ బిల్లును ఆమోదించవద్దని జగన్‌ కోరనున్నారు.

రాష్ట్ర విభజనను అడ్డుకోడానికి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహన్‌రెడ్డి మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే ఓసారి దేశవ్యాప్తంగా పర్యటించి.. ఆర్టికల్‌ 3పై పోరాటానికి కలిసిరావాలని పలు పార్టీల అధినేతలను కోరారు. తాజాగా.. పార్లమెంట్‌కు టి.బిల్లు రానుండగా.. రాష్ట్ర విభజనను అడ్డుకోడానికి చివరి ప్రయత్నాలు చేయనున్నారు. చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉండే పార్టీల మద్దతు కూడగట్టి.. లోక్‌సభలో బిల్లును అడ్డుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు.

అటు.. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని జగన్‌ కలవనున్నారు. పార్టీ ప్రతినిధి బృందంతో రాష్ట్రపతిని కలవనున్న జగన్‌.. కేంద్ర క్యాబినెట్ నుంచి వచ్చే తెలంగాణ బిల్లును ఆమోదించవద్దని విజ్ఞప్తి చేయనున్నారు.

మరోవైపు.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనుండడంతో… సభలో అనుసరించే వ్యూహాలపైనా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సమీక్షించుకుంది. సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు హాజరవ్వాలని వైఎస్ జగన్‌ నిర్ణయించారు. టి.బిల్లుపై కాంగ్రెస్‌ ముందుకు వెళితే.. స్పీకర్‌ పోడియం వద్ద నిరసన తెలిపి.. బిల్లును అడ్డుకుంటామని జగన్‌ చెప్పారు. రాష్ట్ర విభజనను బీజేపీతో పాటు ఇతర విపక్ష పార్టీలు అడ్డుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి… చిత్తశుద్ధితో సమైక్యం కోసం పోరాడే వ్యక్తులకు తాము అండగా ఉంటామన్నారు.

పార్లమెంట్‌లో టి.బిల్లును అడ్డుకోవడంతో పాటు రాష్ట్రపతిని, జాతీయ పార్టీల నేతలను కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యచరణ సిద్ధం చేసింది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Hyderabad News and tagged , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s