టీ-బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

  • ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
  • 32 సవరణలతో బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర
  • శాసనసభ స్థానాల పెంపుపై క్యాబినెట్ కీలక ప్రతిపాదన
  • రెండుగంటల పాటు క్యాబినెట్, గంటపాటు కోర్‌భేటీ
  • అసెంబ్లీలో సూచించిన సవరణలు పార్లమెంటుకు
  • అసెంబ్లీ, మండలి చర్చల సారాంశంపై ఫోకస్
  • సీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదన
  • కొత్త రాజధానికి ఆర్థికసాయం, అవసరమైన అనుమతులు
  • పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రకే..
  • పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
  • హైదరాబాద్ యూటీకి సీమాంధ్ర మంత్రుల డిమాండ్
  • కేబినెట్‌లో అరగంట మాట్లాడిన కావూరి
  • పావు గంట సేపు మాట్లాడిన పళ్లంరాజు
  • బిల్లుపై 5 పేజీల నోట్ తయారు చేసిన హోంశాఖ

తెలంగాణ ఏర్పాటు దిశగా.. కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు పలు సవరణలతో కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సీమాంధ్ర కేంద్ర మంత్రుల అభ్యంతరాల మధ్య… బిల్లుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని మంత్రివర్గం కీలక  ప్రతిపాదన చేసింది. రెండుగంటల పాటు క్యాబినెట్ సమావేశం, గంటపాటు కోర్‌ కమిటీ సమావేశాలు జరిగాయి.

తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మొత్తం 32 సవరణలు చేసి బిల్లును రాష్ట్రపతికి పంపింది. అసెంబ్లీలో సూచించిన సవరణలతో పాటు..  తాజా సవరణలను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ, మండలిలో చర్చల సారాంశాన్ని పార్లమెంటు ముందుకు తీసుకెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. బిల్లులో సీమాంధ్రకు న్యాయం కలిగించాలన్న ఉద్దేశంతో.. ప్యాకేజీ మంత్రాన్ని జపించింది మంత్రివర్గం. రాయల సీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రతిపాదించారు. కొత్త రాజధానికి ఆర్థిక సాయంతో పాటు.. అవసరమైన అటవీ, ఇతర శాఖల అనుమతులు వెంటనే ఇప్పించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల పునర్విభజనను సైతం బిల్లులో ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాల నుంచి 225కు, తెలంగాణలో 119 స్థానాల నుంచి 150కి పెంచాలని కేంద్రమంత్రివర్గం ప్రతిపాదించింది.

పోలవరం ప్రాజెక్టుకు ప్రతిబంధకాలుగా మారుతాయనుకున్న ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలని మార్పులు చేశారు. జాతీయ హోదాతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ప్రతిపాదించారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడంతో పాటు.. శాంతిభద్రతలను గవర్నర్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ యూటీ చేయాలని సీమాంధ్ర మంత్రులు పట్టుబట్టినా క్యాబినెట్… ఆ డిమాండ్‌ను పక్కనపెట్టేసింది.

క్యాబినెట్ సమావేశంలో కావూరి, పళ్లంరాజు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొత్తం అరగంట పాటు కావూరి మాట్లాడారు. విభజనతో నష్టాలను వివరిస్తూనే.. అనివార్యమైతే.. రాయల తెలంగాణతో పాటు హైదరాబాద్ యూటీకి కావూరి పట్టుబట్టినట్లు తెలిసింది. సమావేశంలో పళ్లంరాజు 15 నిమిషాలు మాట్లాడారు. అటు కోర్‌ కమిటీ కూడా ఏపీ వ్యవహారాలపై గంటపాటు కూలంకషంగా చర్చించింది. సీఎం వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది. రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత… ఫిబ్రవరి 12న రాజ్యసభ ముందుకు టీ.బిల్లు వెళ్లనుంది.

ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై హోంశాఖ 5 పేజీల నోట్‌ తయారు చేసింది. బిల్లును ఏపీ అసెంబ్లీ తిరస్కరించిందని నోట్‌లో పేర్కొంది. బిల్లు తిరస్కరణ తీర్మానాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్నీ ప్రస్తావించింది. అసెంబ్లీ రెండోసారి అదనపు సమయం కోరితే రాష్ట్రపతి ఇవ్వలేదన్న అంశాన్ని నోట్‌లో పేర్కొంది.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s