తొలిసారిగా పెద్దల సభలోకి టీఆర్‌ఎస్‌

  • తొలిసారిగా పెద్దల సభలోకి టీఆర్‌ఎస్‌
  • రెండోసారి రాజ్యసభలోకి కేకే
  • టిఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన సిపిఐ
  • ద్వితీయ ప్రాధాన్యతతో సరిపెట్టిన టి-కాంగ్‌, ఎంఐఎం
  • మొదటి ప్రాధాన్యతలో కేకేకు 21 టిఆర్‌ఎస్‌ ఓట్లు, 4 సిపిఐ ఓట్లు
  • కేకేకు అదనంగా మాజీ మంత్రి ఓటు
  • సిపిఐ నేతలకు థ్యాంక్స్‌ చెప్పిన కేసీఆర్‌
  • తొలిసారిగా పెద్దల సభలోకి టీఆర్‌ఎస్‌
  • రెండోసారి రాజ్యసభలోకి కేకే
  • టిఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన సిపిఐ
  • ద్వితీయ ప్రాధాన్యతతో సరిపెట్టిన టి-కాంగ్‌, ఎంఐఎం
  • మొదటి ప్రాధాన్యతలో కేకేకు 21 టిఆర్‌ఎస్‌ ఓట్లు, 4 సిపిఐ ఓట్లు
  • కేకేకు అదనంగా మాజీ మంత్రి ఓటు
  • సిపిఐ నేతలకు థ్యాంక్స్‌ చెప్పిన కేసీఆర్‌
  • సంఖ్యాబలం లేకపోయినా బరిలో దిగిన టీఆర్‌ఎస్‌
  • మొదటి ప్రాధాన్యత క్రమంలో కేకేకు 26 ఓట్లు

టీఆర్‌ఎస్‌కు శుక్ర మహర్దశ నడుస్తున్నట్లుంది. పెద్దల సభకు పోటీ చేసి బోణీ కొట్టింది. పార్టీ  అవిర్భావం నుంచి ఎన్నడూ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయని టిఆర్‌ఎస్‌… మొదటిసారిగా కేకేను అభ్యర్థిగా బరిలోకి దింపింది. కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్థి పోటీ నుండి తప్పుకోవడం… సిపిఐ మద్దతివ్వడంతో పెద్దల సభలోకి ఎంటరైంది టీఆర్‌ఎస్‌.

తొలిసారిగా పెద్దల సభలోకి టీఆర్‌ఎస్‌ అడుగుపెట్టబోతోంది. రాజ్యసభ అభ్యర్థిగా గెలిచేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌…  కాలం కలిసి రావడంతో సునాయాసంగానే విజయం సాధించింది. కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీ నుండి తప్పుకోవడంతో టీఆర్‌ఎస్‌ విజయం నల్లేరుపై నడకే అయింది. 21 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు…నలుగురు సిపిఐ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌కు చెందిన మరో మాజీ మంత్రి కేకేకు ఓటేశారు. దీంతో కేకేకు మొత్తం 26 ఓట్లు మొదటి ప్రాధాన్యత క్రమంలో దక్కాయి. పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించినప్పటికీ రెబెల్‌ అభ్యర్థికి సమైక్య నినాదంతో ఓట్లు పడతాయని టీఆర్‌ఎస్‌ భావించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు కేకే, హరీష్‌రావు రంగంలోకి దిగారు. పోలింగ్‌ సరళిని పూర్తిగా గమనించిన తర్వాత… టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఓట్లు అవసరం లేదని తేలిపోయింది. దీంతో అప్పటివరకు కేకేకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్న టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు… ఆయనకు రెండో ప్రాధాన్యత ఓటుతో సరిపెట్టారు. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంఏ ఖాన్‌కే గంపగుత్తగా ఓటేశారు. వాస్తవానికి 37 ఓట్లు అవసరం ఉన్నప్పటికీ …మరో అభ్యర్థి పోటీలో లేకపోవడంతో 26 ఓట్లే వచ్చినా రాజ్యసభలో ఎంటర్‌ కాబోతున్నారు కేకే.
ఎన్నికల్లో  తనకు ఓటు వేసిన ఎమ్మెల్యేలందరికీ.. కేశవరావు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇచ్చారు. అటు.. టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ థాంక్స్‌ చెప్పారు.

మొదటిసారి పెద్దల సభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎన్నిక కావడంతో గులాబీదళంలో ఉత్సాహం నెలకొంది. అసెంబ్లీలోనూ, గన్‌ పార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ నేతలు సంబరాల్లో మునిగి తేలారు.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s