బాబు క్లాసులతో సిట్టింగ్‌లలో టెన్షన్..

  • ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన చంద్రబాబు
  • రిపోర్టులతో సిట్టింగ్‌లకు షాక్…
  • 50 శాతం ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదన్నది సర్వే సారాంశం
  • నియోజకవర్గాల్లో తటస్థ అభ్యర్థుల కోసం వేట..
  • విజయం సాధించేవారికే టిక్కెట్ల ఖరారు..
  • బాబు క్లాసులతో సిట్టింగ్‌లలో టెన్షన్..

2014లో పార్టీ టికెట్లపై బిందాస్‌గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు షాక్‌ ఇ్చచారు. సిట్టింగ్‌ల కోటి ఆశలపై సర్వే నీళ్లు చల్లారు. ప్రోగ్రెస్ రిపోర్టు పట్టుకుని ఎమ్మెల్యేలకు క్లాస్‌లిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు బాగోలేని నియోజకవర్గాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు.

m5

టీడీపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. పనితీరు బాగో లేని వారిని తప్పించేందుకూ వెనకాడబోమన్న సంకేతాలిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించుకున్నారు. ఈ నివేదిక ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగేలా చేస్తోంది. ఇప్పడున్న టీడీపీ ఎమ్మెల్యేల్లో యాభైశాతం మంది పనితీరు బాగోలేదని రిపోర్టు వచ్చింది. ఆ నియోజకవర్గాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వకపోతే ఓటమి చవిచూసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ సర్వే సారాంశం. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ భవన్‌లో ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు చంద్రబాబు.

1999 ఎన్నికల్లో చంద్రబాబు తటస్టులకు సీట్లు ఇచ్చి రాజకీయాల్లో నూతన అధ్యయానికి తెరలేపారు. ఇప్పడు కూడా ఎమ్మెల్యేల పనితీరు బాలేనిచోట  తటస్తులు, మంచి పేరు ఉన్న అభ్యర్దుల కోసం వేటమొదలుపెట్టారు. మోహమాటానికి పోయి అధికారాన్ని చేజార్చుకునేకంటే… విజయం సాధించే వారికే టికెట్లు ఇవ్వాలని బాబు డిసైడ్ అయ్యారు. తాజా నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్‌ ఎక్కువైంది. ఎమ్మెల్యేలతో భేటి అవుతున్న చంద్రబాబు వారికి చివరి అవకాశం ఇస్తున్నారు. ఎమ్మెల్యేలంతా ప్రజల్లో ఉండాలని బాబు సూచిస్తున్నారు. తర్వాత వచ్చే సర్వేలో ఏదైనా మార్పు ఉంటే సీటు ఇస్తాం లేకపోతే మార్పు తథ్యమని తెగేసి చెబుతున్నారు. దీంతో నాయకులంతా గ్రామాల బాట పట్టాలని నిర్ణయించుకున్నారు.

ఎన్నికల డైడ్‌లైన్ ఒక వైపు…. బాబు సర్వేలు మరోవైపు… ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. దీంతో తమ సీట్లు వేరే వారికి వెళ్ళకుండా లాబియింగ్ మొదలుపెడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s