టి-బిల్‌పై తన్నుకున్న ఎంపీలు..

తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం. పార్లమెంట్‌లో బిల్లు బెల్లు మోగింది. మరుక్షణమే ఊహించని సీన్‌. పదే పది సెకన్లు.. ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. అరుపులు, కేకలు.. కుమ్ములాటలు, ముష్టిఘాతాలు.. హాహాకారాలతో సభ దద్దరిల్లింది. సమైక్య సెంటిమెంట్‌ కాస్తా టెంపర్‌మెంట్‌ స్టేజ్‌ దాటి పెప్పర్‌..మెంట్‌గా ఎగిసిపడింది.  సుష్మా, మీరాకుమార్ సహా సభలో ఉన్నవారందరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది. మొత్తంగా, చట్టసభల సాక్షిగా తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల యుద్ధకాండ.. యావత్ దేశాన్ని నిశ్చేష్ట పరిచింది. ఈ రణరంగంలో తెలుగుజాతి పరువు మంట కలిసిపోయింది.

అటు అరవై ఏళ్ల స్వప్నం.. ఇటు సమైక్యవాదం.. ఇద్దరిదీ గెలవాలన్న పట్టుదలే. ఆ పంతం పతాకస్థాయికి చేరింది. గుండెల్లో రగులుతున్న ఉద్యమజ్వాల ఎవరూ ఊహించని రీతిలో ఎగిసిపడింది. క్షణాల్లో సభ రణరంగమైంది.సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ మీరాకుమార్‌ సభలోకి వచ్చారు. ఎప్పట్లాగే గందరగోళమూ మొదలైంది.

అప్పటికీ టి-బిల్లుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఉంటే ఇవాళ.. లేకుండా సోమవారం అంటూ మంత్రులు నాన్చివేత ధోరణికే మొగ్గు చూపారు. అయినా.. ఇరు పక్షాలు యుద్ద సన్నద్ధత ప్రదర్శించాయి. టి-బిల్లు పెడితే అడ్డుకుని తీరాలన్న కసిలో ఉన్నారు సీమాంధ్ర ఎంపీలు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ ఎంపీలు.. టైమ్‌ 12 కావడానికి 5 నిమిషాల ముందే వెల్‌లోకి చేరుకున్నారు. ఓపక్క లగడపాటి బెటాలియన్‌.. ఇంకోపక్క శివప్రసాద్ బ్యాచ్‌.. మరోవైపు జగన్‌ టీమ్‌.. స్పీకర్ రాగానే నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. బిల్లు పెడుతున్నట్టు అర్థంకాగానే.. ఎంపీ శివప్రసాద్‌, మోదుగుల, కొనకళ్ల ఆ కాగితాలు లాక్కునేందుకు దూసుకెళ్లారు. సరిగ్గా ఇక్కడే కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు వీళ్లను రౌండప్‌ చేశారు. అడుగు ముందుకెయ్యకుండా అడ్డుతగిలారు. టి-టీడీపీ ఎంపీలు సైతం తమ పార్టీ వాళ్లపై ఎదురుతిరిగారు. ఆవేశంతో ఊగిపోయిన మోదుగుల.. లోక్‌సభ సెక్రటరీ జనరల్ దగ్గరున్న మైక్ విరిచేశారు. తనపై దాడి చేస్తున్న వాళ్లపై తిరగబడ్డారు. దీంతో.. ఆయన  కత్తితో పొడవబోయారంటూ కలకలం రేగింది.

అటు, బిల్లు ప్రవేశపెట్టిన షిండేవైపు సీమాంధ్ర ఎంపీలు దూసుకురాకుండా… మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి రక్షణ వలయంలా నిలబడ్డారు. వీళ్లలో కొందరు సీమాంధ్ర సభ్యులతో కలబడ్డారు. టీ-టీడీపీ ఎంపీలు నామా, రమేష్‌ రాథోడ్‌ కూడా సీమాంధ్ర ఎంపీలపై తిరగబడ్డారు. ఈ కొట్లాటతో ఒక్కసారి యావత్‌సభలో సభ్యులు షాక్‌కి గురయ్యారు. స్పీకర్‌ మీరాకుమార్‌ పరిస్థితైతే మాటల్లో చెప్పలేం. ఆమె కొన్ని క్షణాలపాటు బొమ్మలా ఉండిపోయారు. ఇటు.. టీవీసెట్లలో చూస్తున్న వాళ్లలో సైతం మినిట్‌ టు మినిట్‌.. అదే  ఉద్వేగం.. అదే ఉత్కంఠ..

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s