ముగ్గురు నేతలు- 3 స్వరాలు

  • ముగ్గురు నేతలు- 3 స్వరాలు
  • టి-బిల్లుపై బీజేపీలో తలోమాట

తెలంగాణ ఇష్యూని సరిగా హ్యాండిల్‌ చేయలేకపోయారంటూ హస్తం పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్‌లో పెప్పర్‌ స్ప్రే ఘాటు.. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. మేము మూడు రాష్ట్రాలను అందరి సమ్మతితోనే ఇచ్చామంటూ చరిత్రను తిరగేస్తున్న కమలనాథులకు.. తెలంగాణపై క్లారిటీ ఉందా? ఆ పార్టీ అగ్రనేతలు ఏం చెప్తున్నారో చూడండి.

అద్వానీ. బీజేపీ అగ్రనేత. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఈయనే కేంద్ర హోంమంత్రి. తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని అద్వానీ అభియోగం. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన చెందుతున్నారు. ఈపరిస్థితుల్లో ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్లను ఆమోదించుకోవడం మినహా ఇతర బిల్లుల జోలికి వెళ్లొద్దన్నది అద్వానీ సూచన.

కమలదళపతి రాజ్‌నాథ్‌ సింగ్‌కు తెలంగాణపై పక్కా క్లారిటీ ఉంది. రాబోయే ఎన్నికల సంగ్రామంలో విధాన పర నిర్ణయాలు, హామీల రూపకల్పన అంతా ఈయన పేరునే జరుగుతుంది. అంతటి కీరోల్‌ పోషిస్తున్న రాజ్‌నాథ్‌.. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని సూటిగా చెప్పారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని కుండబద్ధలు కొట్టారు. అదే సమయంలో సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించి, సమ న్యాయం చేయాలన్నది రాజ్‌నాథ్‌ డిమాండ్‌.

ఈమె పేరు సుష్మాస్వరాజ్. లోక్‌సభలో కమలనాథులకు లీడర్‌. బిల్లు మీది.. మద్దతు మాది.. అంటూ పలు సభలో కాంగ్రెస్‌ను సవాల్‌ చేశారీమె. ఇప్పుడు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టామని ప్రభుత్వం చెప్తుంటే.. తూచ్‌ అంటున్నారు. ప్రతిపక్ష నాయకురాలి హోదాలో.. స్పీకర్‌ మీరాకుమార్‌ని కలిసిన సుష్మ… తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టామంటే ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు.

మొత్తమ్మీద బీజేపీలోని ముగ్గురు అగ్రనేతలు చెప్తున్నది ఒకటే.. తెలంగాణకు తమ పార్టీ కట్టుబడే ఉంది. కాకపోతే.. ఇప్పటి గందరగోళం అంతా కాంగ్రెస్ స్వయంకృతం. కాంగ్రెస్‌ ఎంపీలు, కేంద్రమంత్రులే సభను అడ్డుకుంటున్న తరుణంలో టి-బిల్లును తాత్కాలికంగా అటకెక్కించి.. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి వదిలేద్దామని చెప్తున్నారు.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s